ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా రసవత్తరంగానే సాగుతుంది. ఇక ప్రేక్షకులు అందరి అంచనాలను సంతృప్తి పరుస్తుంది. అంతేకాదు ప్రతి ఒక్కరిని కన్నార్పకుండా మ్యాచ్ చూసే విధంగా ఉత్కంఠగా జరుగుతుంది ప్రతి మ్యాచ్. ఇలా 2022 ఐపీఎల్ సీజన్ లో ఏ మ్యాచ్ లో ఎలాంటి ఫలితం వస్తుంది అన్నది ప్రేక్షకుల ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అవకాశం దక్కించుకున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉంటే .. ఎన్నో ఏళ్ల నుంచి ఐపీఎల్ లో కొనసాగుతున్న ఆటగాళ్లు మాత్రం పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తూ ఉండడం గమనార్హం.

 కొంత మంది ఆటగాళ్లు అయితే ప్రతి మ్యాచ్ లో కూడా నిరాశపరుస్తూ  జట్టుకు భారంగా మారి పోతున్నారూ అన్నది అర్ధమవుతుంది. ముఖ్యంగా ఆల్రౌండర్గా పేరు సంపాదించుకున్న విజయ శంకర్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతున్నాడు. గత సీజన్ వరకు  సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు లో కొనసాగిన విజయ శంకర్ అక్కడ పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. ఇక ఎప్పుడో ఒకసారి మెరుపులు మెరిపించినా తర్వాత మ్యాచ్ లలో మళ్ళీ  నిరాశ పరచడం లాంటివి చేశాడు విజయ్ శంకర్. ఇక ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ జట్టు తరఫున కొనసాగుతున్నాడు.


 జట్టు మారినా అతని ఆట తీరు మాత్రం మారలేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇందులో విజయ శంకర్ పాత్ర మాత్రం పూర్తిగా శూన్యం అని చెప్పాలి. ప్రతి మ్యాచ్లో కూడా తక్కువ పరుగులకే  వికెట్ కోల్పోతున్నాడు విజయ్ శంకర్. ఇటీవల జరిగిన మ్యాచ్ లో ఇదే రిపీట్ అయింది. విజయ్ శంకర్ ఆటతీరుపై సీనియర్ స్పిన్నర్ పియూష్ చావ్లా  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆల్ రౌండర్ విజయ్ శంకర్ లో కాన్ఫిడెన్స్ లేదని చెప్పుకొచ్చాడు. ఇక అతడికి గుజరాత్ టైటాన్స్ ఇంకా మద్దతు ఇచ్చి గుజరాత్ టైటాన్స్ అతని జట్టులోకి తీసుకుంది అంటే అది ఆశ్చర్యకరమైన విషయమే అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా విజయ్ శంకర్ నాలుగు మ్యాచ్ల్లో కలిపి కేవలం 19 పరుగులు చేశాడు. రెండుసార్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl