ఈ క్రమంలోనే ఐపీఎల్లో వైడ్స్ విషయంలో అంపైర్లు ఇస్తున్న తప్పుడు నిర్ణయాల పై స్పందించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కోచ్ డానియెల్ వెట్టోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ కోల్కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వివాదాస్పదంగా మారిన వైట్ ప్రకటనతో సంజూ శాంసన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే క్లిష్టమైన వైడ్ నిర్ణయానికి డిఆర్ఎస్ వినియోగించి తేల్చాలని బెంగళూరు మాజీ కోచ్ డానియెల్ వెట్టోరి అన్నాడు. వైడ్ విషయాల్లో ఆటగాళ్లు రివ్యూ కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చాడు.
క్లిష్ట పరిస్థితుల్లో ఆటగాళ్లకు స్వేచ్ఛ ఉండాల్సిందే. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్కతా విజయం సాధించింది. అయితే చాలా సార్లు అంపైర్ల నిర్ణయాలు అటు బౌలర్లకు వ్యతిరేకంగానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వైడ్స్ విషయంలో కొన్ని తప్పులు జరిగాయని అభిప్రాయం వ్యక్తం చేశాడు డానియెల్ వెట్టోరి. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. క్లిష్టమైన వైడ్స్ నిర్ణయంపై డిఆర్ఎస్ కు వెళ్లేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని డానియెల్ వెట్టోరి చెప్పుకొచ్చాడు. ఇటీవల కోల్కతాలో జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ అసహనానికి గురై వెంటనే డిఆర్ఎస్ ఇవ్వాలని అడగడం హాట్ టాపిక్ గా మారిపోయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి