విరాట్ కోహ్లీ 2014లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ చేపట్టాడు. ఇక అప్పటి నుంచి గత సీజన్ వరకు కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్గా కొనసాగాడు. ఇక విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వల్ల బెంగళూరు జట్టుకు ఊహించని రీతిలో పాపులారిటీ సాధించింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవక పోయినప్పటికీ ఏకంగా ఛాంపియన్ జట్లతో సమానంగానే ప్రస్తుతం ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది బెంగళూరు. అయితే గత ఏడాది అనూహ్యంగా టీమ్ ఇండియా టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ బెంగళూరు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ.


 దీంతో బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు రాబోతున్నారు అని చర్చ జరుగుతున్న సమయంలో గత ఏడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగిన డూప్లేసెస్ ని కొనుగోలు చేసింది బెంగళూరు ఫ్రాంచైజీ. దీంతో అతని కెప్టెన్సి ఇస్తారంట అందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే బెంగళూరు కొత్త కెప్టెన్ డుప్లెసిస్  అంటూ యాజమాన్యం ప్రకటించింది. ఇక ఈ ఏడాది డూప్లెసిస్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిలకడగా రాణిస్తోంది. 12 మ్యాచులలో ఏడు విజయాలు సాధించి 4వ స్థానంలో కొనసాగుతోంది.


 ఇక కెప్టెన్ డూప్లేసెస్ ఎంతో మెరుగైన ఆటతీరును కనబరుస్తూ 12 ఇన్నింగ్స్ లో 389 పరుగులు చేశాడు. కాగా డుప్లెసిస్ కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా కెప్టెన్ గా ఉన్నప్పుడు మిగతా సందర్భాల్లో మేము బాగా కలిసి ఉండేవాళ్ళం అతడికి మైదానంలో పూర్తి అధికారం ఉంటుంది.  కొన్నిసార్లు నేను ఇచ్చిన సూచనలు కూడా అతను నో చెప్పాడు. దాన్ని నేను గౌరవిస్తాను. ఇలా చేయడం కెప్టెన్ గౌరవాన్ని పొందేలా చేస్తోంది అంటు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఎబి డివిలియర్స్ వచ్చే సీజన్లో మళ్లీ అందుబాటులోకి రావచ్చు ఏమో అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ..

మరింత సమాచారం తెలుసుకోండి: