ఐపీఎల్  లో లీగ్ మ్యాచ్ లూ ముగింపు దశకు చేరుకున్నాయ్. మరికొన్ని రోజుల్లో ప్లే ఆఫ్ మ్యాచ్ లూ జరగబోతున్నాయి. అయితే ఇప్పటికే లక్నో జట్టుపై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ ఇటీవలే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ప్లే యాప్ లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న లక్నో జట్టు  ఒక మ్యాచ్ గెలిస్తే చాలు ప్లే ఆఫ్ లో అడుగుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే చివరి రెండు స్థానాల గురించి మాత్రమే ప్రస్తుతం అన్ని జట్లు పోరాడుతూ ఉన్నాయన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలో ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయి ఐపీఎల్ నుంచి నిష్క్రమించాయన్న విషయం తెలిసిందే. కేవలం నామమాత్రపు మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్నాయి. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుతం ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆడిన ప్రతీ మ్యాచ్లో కూడా తప్పక గెలవాల్సి ఉంది. ఈ క్రమంలోనే నేడు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ ఆడబోతుంది.


 కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతుండగా కోల్కతా నైట్రైడర్స్ జట్టు వరుసగా ఓటములతో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. పూణేలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. సాయంత్రం  7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా నేడు జరగబోయే మ్యాచ్ అటు కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ఎంతో కీలకమైనది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే రెండు జట్ల కి ప్లే ఆఫ్ అవకాశాలు అవకాశాలు సజీవంగా ఉంటాయి అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl