ఒకప్పుడు టీమిండియాలో స్టార్ ఓపెనర్ గా శిఖర్ ధావన్  ప్రస్థానం ఎంతో విజయవంతంగా సాగింది. ఓపెనర్లుగా జట్టుకు మంచి ప్రారంభాన్నిస్తూ ఎప్పుడూ అదరగొడుతు ఉండేవాడు శిఖర్ ధావన్. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం జట్టులో యువ ఆటగాళ్ల పోటీ ఎక్కువ అయిన నాటి నుంచి కూడా శిఖర్ ధావన్ కు అటు టీమిండియాలో అడపాదడపా అవకాశాలు దక్కుతున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా గత ఏడాది టి20 వరల్డ్ కప్ నుంచి టీమిండియాకు దూరమైపోయాడూ శిఖర్ ధావన్.


 అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించి మళ్లీ టీమిండియాలో పునరాగమనం చేశాడు అని అందరూ అనుకున్నారు. కానీ శిఖర్ ధావన్ కి మాత్రం చేదు అనుభవం తప్పలేదు అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న శిఖర్ ధావన్ మంచి ప్రదర్శన కనబరిచాడు. 13 మ్యాచ్ లలో 421 పరుగులు సాధించాడు. టోర్నీ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతున్నాడు. కానీ ఎందుకో బిసిసిఐ సెలెక్టర్లు మాత్రం శిఖర్ ధావన్ విషయంలో కనికరించలేదు.



 యువ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, హర్ష దీప్  సింగ్ తో పాటు  దినేష్ కార్తీక్ ని కూడా జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ఎందుకో శిఖర్ ధావన్ ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతోన్న వెంకటేష్ అయ్యర్ కు అవకాశం ఇవ్వడం గమనార్హం. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శిఖర్ ధావన్ అద్భుతం గా రాణిస్తున్న చోటు ఇవ్వకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

 కాగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ కు బీసీసీఐ ప్రకటించిన జట్టు వివరాలు ఇలా ఉన్నాయి : కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా, వెంకటేశ్ అయ్యర్, యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

మరింత సమాచారం తెలుసుకోండి: