
సచిన్ టెండూల్కర్ కొడుకు కావడం వల్ల అతనికి అవకాశాలు రావడం లేదని కొంతమంది వాపోతుంటే.. ఇంకా అతను నేర్చుకునే దశలోనే ఉన్నాడని మరి కొంతమంది అంటున్నారు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ దిగ్గజం తొలి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ కపిల్‌దేవ్ అర్జున్ టెండూల్కర్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అర్జున్ టెండూల్కర్ ఇంకా చిన్న కుర్రాడని ఒకవేళ క్రికెట్ లో రాణించాలనీ అనుకుంటే అతని తండ్రి లో 50% చేసినా సరిపోతుంది అని వ్యాఖ్యానించాడు. ఇటీవల ఒక మ్యాగజైన్ తో మాట్లాడుతూ అందరూ అర్జున్ టెండూల్కర్ గురించి మాట్లాడుతున్నారు.. అర్జున్ సచిన్ టెండూల్కర్ కొడుకు అలాగనీ అర్జున్ ను సచిన్ తో పోల్చకండి.
అతడి ఆటను అతన్ని ఆడుకో నివ్వండి. టెండూల్కర్ అనే పేరు అర్జున్ కు ఉండడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి.. గతంలో బ్రాడ్ మాన్ కొడుకుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే పేరు మార్చుకున్నాడు. ఇక ఇప్పుడు అర్జున్ టెండూల్కర్ ను ఒత్తిడి చేయకండి.. సచిన్ అతని తండ్రి అయినప్పుడు ఇక అర్జున్ ఆట గురించి చెప్పడానికి మనం ఎవరం చెప్పండి. ఒక విషయం అతనికి చెప్పాలనుకుంటున్నాను.. నీ ఆట నువ్వు ఆడు.. ఎవరి దగ్గర నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ నాన్న ఆడిన ఆటలో నువ్ సగం ఆడిన అది గొప్ప విషయమే అంటూ కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.