సాధారణంగా ఉత్కంఠభరితంగా మ్యాచ్ జరుగుతుంది అంటే.. ఇక బౌలర్లు వికెట్లు పడగొడుతూ ఉంటే.. బ్యాట్స్మెన్ లు సిక్సర్లు కొడుతూ ఉంటే ఆ మ్యాచ్ కి  చూసే ప్రేక్షకులను ఎంత ఉత్కంఠ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇలాంటి ఉత్కంఠను రేకెత్తించేది ఆటగాళ్లు మాత్రమే కాదు.. ఏకంగా మైదానంలో జరుగుతున్న మ్యాచ్ కి ప్రాణం పోసే కామెంటెటర్లు    అనే విషయం తెలిసిందే. బౌలర్ వికెట్  తీసినప్పుడు ఒక సాధారణ ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడో  కామెంటేటర్ లు  అదే రేంజ్ లో కామెంట్రీ  ఇస్తూ ఉంటారు. బ్యాట్స్మెన్  సిక్సర్ కొట్టి నప్పుడు ఎలా ప్రేక్షకుడు ఎగిరి గంతేస్తాడో కామెంటేటర్ కూడా అదేరీతిలో కామెంట్రీ ఇస్తాడు.


 అందుకే క్రికెట్ మ్యాచ్ కి అటు ఆటగాళ్లు అంపైర్ లతోపాటు కామెంటేటర్ లు కూడా ఎంతో కీలకం అని చెప్పాలి. మ్యాచ్ చూసేందుకు వెళ్లే అభిమానులను పక్కనపెడితే అటు టీవీల ముందు కూర్చుని మ్యాచ్ వీక్షించే ప్రేక్షకులకు  కామెంటేటర్ లు  ఇక క్రికెట్ మ్యాచ్ లోని అసలు సిసలైన మజాను పంచుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక మనం చిన్నప్పుడు టీవీలు రాకముందు రేడియోలో ఈ కామెంట్రీ ద్వారా ఎంతోమంది మ్యాచ్ ను ఆస్వాదించేవారు. అది సరే గానీ ఇక ఇప్పుడు ఉన్న ఫలంగా కామెంటేటర్ ల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి వచ్చింది అనే కదా మీ డౌట్.


 ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్లో నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అయితే ఈ మ్యాచ్ లో అన్నింటినీ కూడా ప్రత్యక్ష ప్రసారం చేయబోతుంది స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం. తమ కామెంటరీ ప్యానల్ ను ప్రకటించింది.  ఇక ఈ ప్యానల్ లో 13 మంది తో కూడిన హిందీ, ఇంగ్లీష్ కామెంటేటర్ లు ఉన్నారు అని చెప్పాలి. ఇందులో మందులు హర్షా భోగ్లే ని మినహాయిస్తే 12 మంది ఏదో ఒక దశలో క్రికెట్ ఆడిన వారే కావడం గమనార్హం. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా ఈ కామెంటరీ ప్యానల్ పై సరదాగా కామెంట్ చేస్తున్నారు.  ఇంగ్లాండ్ ఇండియా జట్ల కంటే కామెంట్రీ ప్యానల్ పటిష్టంగా కనిపిస్తుంది. కామెంట్రీ  ప్యానల్ లో బ్యాట్స్ మెన్స్, బౌలర్ కూడా ఉండటంతో మరో క్రికెట్ జట్టును తలపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: