
అయితే వినేష్ ఫోగట్ గురించి అటు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక క్రీడాకారిణిగా కొంతమందికి తెలిస్తే దంగల్ అనే సినిమా ద్వారా ఎంతో మందికి తెలిసింది ఈ క్రీడాకారిణి. అయితే గత ఏడాది టోక్యో ఒలంపిక్స్ లో వినేష్ ఫోగట్ బంగారు పతకం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో విఫలం అయ్యి అందరిని నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే 2016 రియో ఒలంపిక్స్ లో కూడా గాయం కారణంగా చివరికి పథకానికి దూరమైంది అనే విషయం తెలిసిందే.
గత ఏడాది కూడా క్వార్టర్ ఫైనల్స్ లో ఒలంపిక్స్‌లో ఓడిపోవడం తో ఇక రెజ్లింగ్ వదిలేయడం బెటర్ అని నిర్ణయించుకున్నాను అంటూ వినేష్ ఫోగాట్ ఇటీవల చెప్పుకొచ్చింది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాటలు తనను ఎంతగానో ఉత్తేజ పరిచాయి అంటూ తెలిపింది. ఈ క్రమం లోనే ప్రధాని మాటలతో ఎంతగానో ప్రేరణ పొంది పట్టువిడవకుండా ప్రయత్నించి చివరికి ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించాను అంటూ చెప్పుకొచ్చింది వినేష్ ఫోగట్. కామన్వెల్త్ గేమ్స్ లో రెజ్లింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన నేపథ్యంలో ఇక వినేష్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.