
ఇక ఇలా వరుసగా స్టార్ ప్లేయర్లందరూ దూరమవుతుండడం ఆ జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే పిక్కల్లో గాయం కారణంగా స్టార్ ప్లేయర్ దుష్మంత చమీరా చివరికి వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే మొన్నటికి మొన్న ఆసియా కప్ లో కూడా గాయం కారణంగా అతను ఆడలేదు. ఇక గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన కొన్నాళ్లకే మళ్ళీ గాయం తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇక దుష్మంతా చమీరా లాంటి కీలక ఆటగాడు దూరం అవడం అటు శ్రీలంక జట్టుకు ఎదురుదెబ్బ అని చెప్పాలి.
ఇకపోతే ఇప్పటికే స్టార్ బౌలర్ దుష్మంత చమీరా దూరం కావడంతో నిరాశలో ఉన్న శ్రీలంక జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టులో స్టార్ బ్యాటర్ గా కొనసాగుతున్న ధనుష్క గుణతిలక కూడా తొడగండలాల గాయంతో వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు అనేది తెలుస్తుంది. ఇలా ఇద్దరు స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో శ్రీలంక జట్టు యాజమాన్యం అయోమయంలో పడిపోయింది. ఇక దనుష్క గుణ తిలక స్థానంలో అసేన్ బండార, ఇక దుష్మంత చమీర స్థానంలో కసున్ రజితకు ఛాన్స్ ఇచ్చారు. ఇలా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు ఎలా రాణిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.