టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా దేశ విదేశాల్లో కూడా కోట్ల మంది అభిమానులు విరాట్ కోహ్లీని  అమితంగా ఆరాధిస్తూ ఉంటారు అని చెప్పాలి   ఎందుకంటే తన ఆటతీరుతో అంతలా గుర్తింపు సంపాదించుకున్నాడు విరాట్ కోహ్లీ.. ఏకంగా ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం విరాట్ కోహ్లీ ఆటతీరు చూసి మంత్రముగ్ధులు అవుతూ అతని అభిమానించడం మొదలుపెడతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక నేటి జనరేషన్ క్రికెటర్లలో చూసుకుంటే విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులకు ఎవ్వరూ చేరువలో కూడా లేరు.


 ఇలా అంతర్జాతీయ క్రికెట్లో తన హవా నడిపించే విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో కూడా ఎవరికి సాధ్యం కానీ రీతిలో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. క్రికెటర్లు ఉన్నప్పటికీ కోహ్లీకి ఉన్న ఫాలోవర్స్ చూస్తే మాత్రం అందరూ ఎంతో దూరంలోనే ఉండిపోయారు. అయితే విరాట్ కోహ్లీ ఒకవైపు క్రికెట్ ద్వారానే కాదు వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తూ ఉంటాడు. అందుకే క్రికెట్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లీని కింగ్ అని అంటూ ఉంటారు. ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.



 ఇండియన్ ట్విట్టర్ చరిత్రలోనే కోహ్లీ చేసిన ట్విట్ కూ  అత్యధిక లైక్స్ వచ్చాయి అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ తర్వాత తనకు మద్దతుగా నిలిచిన అందరికీ థాంక్స్ చెబుతూ విరాట్ కోహ్లీ ఒక ట్వీట్ చేశాడు అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ చేసిన ఈ పోస్ట్ కి ఏడు లక్షల 68,000 లైక్స్ వచ్చాయి  ఇక ఇప్పుడు వరకు ట్విట్టర్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఈ విషయం గురించి తెలిసి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసిన ట్వీట్ చేసిన రికార్డులే అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: