ఇకపోతే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోతుంది అనుకున్న పరిస్థితుల నుంచి జట్టును గెలిపించి తన సత్తా ఏంటో చూపించాడు విరాట్ కోహ్లీ. కనీసం సింగిల్స్ డబుల్స్ తీయడానికి కూడా కష్టతరమైన పరిస్థితుల్లో ఏకంగా సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయాడు అని చెప్పాలి. కట్టుదిట్టంగా ప్రత్యర్థి బౌలర్లు బంతులను సందిస్తున్న సమయంలో తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఇక భారీ సిక్సర్లు కొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి ఈ క్రమంలోనే ఓటమి ఖాయం అనుకున్న దశ నుంచి విజయం వైపుగా జట్టును తీసుకొచ్చాడు.
పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ ఆడిన సూపర్ ఇన్నింగ్స్ పై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపిస్తుంది అని చెప్పాలి. కాగా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ గురించి స్పందించిన ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక కోహ్లీ పై గతంలో విమర్శలు చేసిన వారికి చురకలు అంటించాడు. గతంలోకి కోహ్లీ బ్యాటింగ్ సామర్థ్యాల పై కొందరు వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది. విమర్శలు చేసిన వారు ఎవరు కూడా కోహ్లీ రికార్డులను చూసి ఉండకపోవచ్చు. గేమ్ లో కొన్నిసార్లు సెంచరీలు అర్థ సెంచరీలు చేయకపోవచ్చు కానీ కోహ్లీ లెజెండరీ క్రికెటర్ అంటూ బ్రెట్ లి వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి