టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఎంతోమంది ఆటగాళ్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ బరితంగా జరుగుతున్న నేపథ్యంలో ఎంతో మంది ఆటగాళ్ళు తమ అద్భుతమైన ప్రదర్శనతో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఇక ఇలా రికార్డులు సృష్టిస్తున్న ఆటగాళ్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు సంబంధించిన వార్త కూడా సోషల్ మీడియాలో అందరిని అవాక్కేయ్యేలా చేస్తుంది.


 అదేంటి క్రికెటర్లు అన్న తర్వాత రికార్డులు సాధించడం సర్వసాధారణం అలాంటిది ధనుష్క గుణతిలక గురించిన వార్త ఎందుకు అందరిని షాకీ గురిచేస్తుంది అని అనుకుంటున్నారు కదా. అయితే వైరల్ గా మారిపోయిన వార్త అతను సాధించిన రికార్డుల గురించి కాదు ఏకంగా రేప్ కేసులో అతను అరెస్టు అవ్వడం గురించిన వార్త సెన్సేషన్ సృష్టిస్తుంది. వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక జట్టు తరఫున మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ క్రికెటర్ ధనుష్క గుణతిలకను ఇటీవల సిడ్నీ పోలీసులు అరెస్టు చేశారు. వరల్డ్ కప్ మధ్యలో గాయంతో జట్టుకు దూరమైన క్రికెటర్ ధనుష్క గుణతిలక  సిడ్నీలోని ఒక హోటల్లో ఉంటున్నాడు.


 ఈ క్రమంలోనే అక్కడ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ క్రికెటర్ ధనుష్క గుణతిలక పై ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే కేసును నమోదు చేసుకున్న సిడ్ని పోలీసులు అతని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఇటీవలే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించిన శ్రీలంక జట్టు.. ఇక స్వదేశానికి పయనమైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇంతలోనే గుణ తిలక అరెస్టు కావడంతో అతన్ని ఆస్ట్రేలియాలోనే వదిలేసి స్వదేశానికి పయనం అయింది శ్రీలంక టీం. ఇక ఇప్పుడు ఈ వార్త కాస్త సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: