ప్రస్తుతం ఖథార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు అందరూ కూడా ఈ మ్యాచ్లను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా ఫుట్బాల్ ఆటలో ఏకంగా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అందరిని కూడా తప్పించుకొని గోల్ చేయడం అనేది అంత సులువైన విషయం కాదు. ఒకవేళ  ఇలా ఆటగాళ్లు ఎవరైనా గోల్డ్ సాధించారు అంటే చాలు ఇక సంబరాల్లో మునిగిపోవడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పుడు వరకు ఇలా ఎవరైనా ఆటగాడు గోల్ చేశాడు అంటే చాలు సంబరాలు మునిగిపోవడం లాంటివి ఇప్పటివరకు చాలానే చూశాం. కానీ ఇక ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ జి దశలో స్విట్జర్లాండ్, కామరూన్ జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో మాత్రం ఒక ఆటగాడు అద్భుతమైన గోల్ చేసినప్పటికీ సంబరాలు చేసుకోకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. స్విస్ స్త్రైకర్ అయిన బ్రీల్ ఎంబోలో అద్భుతమైన గోల్ తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఇదే మొదటి గోల్ కావడంతో ఇక జట్టు ఆటగాళ్లందరూ సంబరాల్లో మునిగిపోయారు.


 కానీ ఇక ఎంతో కష్టపడి గోల్ చేసిన బ్రిల్ ఎంబోలో మాత్రం ఎక్కడ సెలబ్రేషన్స్ కు పోకుండా కదలకుండా ఒకే చోట నిలబడి సైలెంట్ గా ఉన్నాడు. గోల్  సాధించిన ఆనందం మాత్రం అతని ముఖంలో ఎక్కడా కనిపించలేదు అని చెప్పాలి. అంతేకాదు ఏదో తప్పు చేసిన వాడిలా మొఖం ఎక్స్ప్రెషన్ పెట్టాడు సదరు ప్లేయర్. అయితే ఇలా అతను గోల్ చేసిన తర్వాత సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండడానికి ఒక కారణం ఉందట. అతను కామరూన్ రాజధాని ఏవోండే లో జన్మించాడట. తర్వాత తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో తల్లి అతని తీసుకొని స్విజర్లాండ్ లోని బాసేల్ కు వచ్చి స్థిరపడ్డారట. అయితే ఇలా కామరూన్లో పుట్టినప్పటికీ అతనివిద్యాభ్యాసం మాత్రం స్విజర్లాండ్ లో సాగింది. ఇలా తాను పుట్టిన దేశం మీదే గోల్ కొట్టి సంబరాలు చేసుకోవడమేంటి అనుకున్నాడో ఏమో చివరికి సైలెంట్ గా ఉండిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: