క్రికెట్ ఆటకి అటు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ అంతకంతకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక క్రికెట్ కి సంబంధించిన ఏ విషయం సోషల్ మీడియాలోకి వచ్చిన తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఎంతోమంది ప్లేయర్స్ సాధిస్తున్న రికార్డుల గురించి తెలుసుకుంటూ ఆశ్చర్యపోతున్నారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే ఇటీవల కాలంలో క్రికెట్ చూసుకుంటే మాత్రం క్రికెట్ అనేది కేవలం బ్యాట్స్మెన్ల ఆట మాత్రమే అన్న విధంగా మారిపోయింది. ఇక పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ల విధ్వంసం చూసినా కూడా ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది.


 ఇక భారత్ వేదికగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో ఎంతోమంది ప్లేయర్లు విధ్వంసం సృష్టిస్తూ సెంచరీలతో చదిరేగిపోతున్న తీరు చూస్తే కూడా క్రికెట్ అంటే కేవలం బ్యాట్స్మెన్ లదే హవా నడుస్తూ ఉంటుందని క్రికెట్ ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వరకు బ్యాట్స్మెన్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టడం.. మొన్నటికి మొన్న రుతురాజ్ ఏకంగా ఆరు బంతుల్లో 7 సిక్సర్లు కొట్టడం కూడా జరిగింది. కానీ ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీయలేదు.


 ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన టెన్నిస్ బాల్ టోర్నీలో మాత్రం ఇది నిజం అయింది అని చెప్పాలి. పాన్వెల్ లో జరుగుతున్న టోర్నీలో ఒక బౌలర్ ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు తీసి ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఉస్లారి కుర్తిలో జరుగుతున్న గాందేవీ ఉసరై చెస్క్ టోర్నమెంట్లో లక్ష్మణ్ అనే బౌలర్ ఒకే ఓవర్లు ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. దొండరోచపాడు, గావ్ దేవి జట్ల మధ్య  మ్యాచ్ జరిగింది. దొండ్రచపాడు నిజానికి 43 పరుగులు కావాల్సిన సమయంలో తొలి ఓవర్ లోనే లక్ష్మణ్ ఆరుగురు బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చాడు. అంతే కాదు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దీంతో అతని ప్రతిభను గురించి తెలిసి ప్రతి ఒక్కరు మంత్రముగ్దులు అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: