ఇదిలా ఉంటే ఇక భారత్లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించడంపై ఏకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ షాక్ ఇవ్వబోతుందా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. అయితే ఇలా ఐసిసి ఏకంగా భారత్ నుంచి వరల్డ్ కప్ వేదికను మార్చే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. దీనికి కారణం ఏకంగా పన్ను చెల్లింపులే అన్నది మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హార్ట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ భారత్ లో వన్డే వరల్డ్ కప్ ను నిర్వహించాలి అంటే ఏకంగా ప్రభుత్వానికి 900 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
అయితే భారత్ లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు గాను ఇక బీసీసీఐ ఏకంగా ప్రభుత్వంతో మాట్లాడి పన్ను మినహాయింపు ఇప్పించాలి అంటూ ఎన్నోసార్లు కోరింది. అయితే ఐసీసీ ఎన్నిసార్లు పన్ను మినహాయింపుకు సంబంధించి చర్చలు జరిపిన కూడా బీసీసీఐ మాత్రం ఈ విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదట. ఒకవేళ ఇదే జరిగితే ఐసీసీ చెల్లించే పన్ను 900 కోట్ల రూపాయలను బీసీసీఐ వాటాలో కోత విధించడం లేదా వేదికను మార్చడం పైన ఐసీసీ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం భారత్లో వన్డే వరల్డ్ కప్ జరగడం అనుమానంగానే కనిపిస్తుంది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి