ప్రస్తుతం టీమిండియాలో సీనియర్ ప్లేయర్ గా కొనసాగుతున్న జయదేవ్ ఉనాద్గత్ గత కొంతకాలం నుంచి వార్తల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అప్పుడెప్పుడో 2010లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడిన జయదేవ్ ఉనాద్గత్.. ఆ తర్వాత ఎందుకో కానీ ఇక భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఐపీఎల్లో పలు ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిధ్యం వహించి ఇక తన ప్రదర్శనతో సత్తా చాటినప్పటికీ ఎందుకో భారత సెలక్టర్లు మాత్రం జట్టు ఎంపికలో అతని పరిగణలోకి తీసుకోలేదు అని చెప్పాలి. ఇక ఇలా భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ చివరికి 12 ఏళ్లు గడిచిపోయాయి.


 దీంతో కేవలం ఐపిఎల్ లో మాత్రమే అప్పుడప్పుడు కనిపిస్తున్న జయదేవ్ ఉనాద్గత్ గురించి అటు అభిమానులు కూడా మరిచిపోయారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టులో 12 ఏళ్ల తర్వాత అవకాశం దక్కించుకున్న జయదేవ్ ఒక్కసారిగా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంతేకాదు ఇక మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే ఇక బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశంలో జరుగుతున్న రంజీ ట్రోఫీలో భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సౌరాష్ట్ర కెప్టెన్ గా కూడా ఉన్నాడు. ఇక తన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే రంజీ ట్రోఫీతో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో సౌరాష్ట్ర కెప్టెన్ జయదేవ్ ఉనాద్గత్ అదరగొట్టాడు. ఏకంగా తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ సాధించాడు అని చెప్పాలి. ఇక అంతేకాదు తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిది వికెట్లు తీసిన అతడు బ్యాటింగ్ లో కూడా రానించాడు. ఎనిమిదవ స్థానంలో బరిలోకి దిగిన జయదేవ్ ఐదు ఫోర్లు ఐదు సిక్సర్ల సహాయంతో 68 బంతుల్లో 70 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే 8 వికెట్ల నష్టానికి 574 పరుగుల వద్ద చివరికి జయదేవ్ తమ జట్టు ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేశాడు అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో అటు ఢిల్లీ జట్టు 133 పరుగులకే ఆల్ అవుట్ అయింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: