టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఎంతలా హవా నడిపిస్తూ ఉంటాడో అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరిలాగే ఒక సాదాసీదా క్రికెటర్ గా భారత జట్టులోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ తక్కువ సమయంలోనే తాను అందరు లాంటి ఆటగాడిని కాదు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయి ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక  రికార్డుల విషయంలో నేటి జనరేషన్ క్రికెటర్లకు అందనంత దూరంలో ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ఎప్పుడు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే కోహ్లీ సాధించిన రికార్డులను.. మీమ్స్ రూపంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయేలా చేస్తూ ఉంటారూ అని చెప్పాలి.  ఇక ఇప్పుడు అభిమానులు అందరూ కూడా విరాట్ కోహ్లీని వాల్తేరు కోహ్లీగా మార్చేశారు. కారణం ఇటీవల చిరంజీవి హీరోగా నటించినా వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక పవర్ ఫుల్ డైలాగ్. రికార్డుల్లో  నా పేరు ఉండడం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి అంటూ చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఇక విరాట్ కోహ్లీకి బాగా సెట్ అవుతుందని అభిమానులు భావించారు.


 ఇక వాల్తేరు వీరయ్య పోస్టర్లో మెగాస్టార్ ఫోటోలు తీసుకుని ఇక దారిని మార్ఫింగ్ చేసి కోహ్లీ ఫోటోని జోడించి ఇక కింద చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ను యాడ్ చేసి ఇక ఆ మిమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ఈ మీమ్స్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇది చూసిన తర్వాత ఏది ఏమైనా మీమర్స్ క్రియేటివిటీ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: