
అయితే భారత జట్టు చేతిలో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు మూడో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం పుంజుకుంది. ఇక భారత జట్టును చిత్తుగా ఓడించి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇకపోతే సిరీస్ గెలవాలంటే అటు నాలుగో టెస్ట్ మ్యాచ్ ఇరు జట్లకు కూడా కీలకంగా మారబోతుంది అని చెప్పాలి. ఈ నెల 9వ తేదీ నుంచి 4వ టెస్ట్ జరగనుంది. ఇకపోతే ఇక నాలుగో టెస్ట్ కు ముందు మరోసారి ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది అన్నది తెలుస్తుంది. ఏకంగా కెప్టెన్ కమిన్స్ దూరం కాబోతున్నాడట.
ఇప్పటికే అనారోగ్యం బారిన పడిన తన తల్లిని చూసేందుకు వ్యక్తిగత కారణాలతో మూడో టెస్ట్ నుండి తప్పుకుని స్వదేశం వెళ్ళాడు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్. ఈ క్రమంలోనే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న స్టీవ్ స్మిత్ ఇక ఇప్పుడు సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక అతని కెప్టెన్సీ లోనే అటు ఆస్ట్రేలియా మూడో టెస్ట్ మ్యాచ్ గెలిచింది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ దూరం కావడమే కాదు ఇక ఇండియాతో జరగబోయే వన్డే సిరీస్ కు ఎంపికైన ఆస్ట్రేలియా ఫేసర్ రిచర్డ్ సన్ సైతం పూర్తిగా సిరీస్ కు దూరమయ్యాడు అన్నది తెలుస్తుంది.