
అయితే ఇప్పటికే పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ లో ఆడేందుకు తాము పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టబోమని తటస్థ వేదికపై మ్యాచ్ లను నిర్వహిస్తేనే తాము ఇక ఆసియా కప్ లో కొనసాగుతాము అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ కేవలం భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం యూఏఈ లేదా శ్రీలంక వేదికగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే తరహాలో వన్డే వరల్డ్ కప్ విషయంలో కూడా ఐసిసి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతుందట.
ఆసియా కప్ కోసం భారత్ పాకిస్తాన్ రావట్లేదు కాబట్టి.. మేము కూడా వరల్డ్ కప్ కోసం భారత్ వెళ్లబోము పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తేల్చి చెబుతుంది. ఈ క్రమంలోనే ఇక భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ ఆడేందుకు పాకిస్తాన్ విముఖత చూపుతున్న నేపథ్యంలో ఆ జట్టుకు మరో వేదిక కేటాయించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడబోయే మ్యాచ్లను నిర్వహించాలని అనుకుంటుందట ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మరోవైపు మాజీ క్రికెటర్ ఐసిసి జనరల్ మేనేజర్ ఆఫ్ క్రికెట్ కూడా భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ కి ప్రత్యామ్నాయ వేదిక ఉండొచ్చు అంటూ హింట్ ఇచ్చాడు అని చెప్పాలి.