ఒకవైపు సీనియర్ అనే ముద్రపడటం.. ఇక మరోవైపు పేలవమైన ఫామ్ లో ఉండడంతో ఒకప్పటి భారత జట్టు స్టార్ ఓపెనర్  శిఖర్ ధావన్ ఇక ఇటీవల కాలంలో టీమిండియాలో ఛాన్స్ దక్కించుకోలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ లో మాత్రం తప్పక చోటు సంపాదించుకోవాలని భావిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ లో అదరగొట్టి ఇక సెలక్టర్ల చూపును ఆకర్షించాలని భావిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 కాగా ప్రస్తుతం శిఖర్ ధావన్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుకి కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకవైపు జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించడమె కాదు మరోవైపు.. ఇక తన వ్యక్తిగత ఆట తీరూని కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కోల్కత్తా తో జరిగిన మొదటి మ్యాచ్ లోనే అటు శిఖర్ ధావన్ కెప్టెన్సీ లోని పంజాబ్ కింగ్స్ జట్టు సత్తా చాటింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక శిఖర్ ధావన్ 40 పరుగులు చేసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని  నమోదు చేశాడు. దీంతో  ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.



 ఐపీఎల్ హిస్టరీ లోనే అత్యధిక సార్లు 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు శిఖర్ ధావన్. విరాట్ కోహ్లీ 94 సార్లు 50 ప్లేస్ స్కోర్ భాగస్వామ్యాలు నమోదు చేశాడు అని చెప్పాలి. ఇక ఇటీవల శిఖర్ ధావన్ సైతం 40 పరుగులు చేసి ఇక ఈ రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్ చివరి దశలో ఉన్న సమయంలో వర్షం రావడంతో ఇక అంపైర్లు మ్యాచ్ నిలిపివేశారు. ఇక డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం పంజాబ్ జట్టును విజేతగా ప్రకటించారు అని చెప్పాలి. మొదటి మ్యాచ్ లో విషయం సాధించడంతో ఇక పంజాబ్ కింగ్స్ లో కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: