
అయితే మిగతా భాషల్లో నాని సినిమాకు పెద్దగా కలెక్షన్స్ రాకపోయినప్పటికీ అటు తెలుగులో మాత్రం ఈ సినిమా దుమ్ము రేపుతోంది అని చెప్పాలి. కేవలం ఐదు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 92 కోట్ల వసూళ్లు సాధించింది ఈ సినిమా. ఇక అటు నిర్మాతలకు భారీగా లాభాలు తెచ్చి పెట్టింది అని చెప్పాలి. ఇక ప్రతి ఒక్కరు కూడా థియేటర్లకు వెళ్లి దసరా సినిమా చూస్తున్నారు. మాస్ ప్రేక్షకులైతే ఇక ఈ సినిమా చూసి పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతున్నారు అని చెప్పాలి. మరికొన్ని రోజులు దసరా సినిమా 100 కోట్ల వసూళ్ల మార్క్ చేరుకుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి.
ఇలా మంచి సినిమా తీసి తనకు లాభాలు వచ్చేలా చేసిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకూ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక కాస్లీ గిఫ్ట్ ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా 80 లక్షల విలువ చేసే లగ్జరీ కార్ బహుమతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట. అయితే శ్రీకాంత్ ఓదెల కొత్త డైరెక్టర్ కావడంతో రెమ్యూనరేషన్ తక్కువగానే మాట్లాడుకున్నాడట. సినిమా హిట్ అయిన తర్వాత ఏదో ఒకటి చేస్తానని నిర్మాత మాటిచ్చాడట. ఇచ్చిన మాట ప్రకారం సినిమా హిట్ అయిన తర్వాత ఇప్పుడు కాస్లీ కార్ గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే అంతకుముందు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇచ్చేందుకు నిర్మాత సుధాకర్ చేరుకూరి నిర్ణయించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.