
అయితే ముంబై ఇండియన్స్ టీమ్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలా మంచి ప్రదర్శన చేస్తున్న యంగ్ ప్లేయర్స్ లో తిలక్ వర్మ ఒకరు అని చెప్పాలి. గత ఏడాది టీమ్ మొత్తం విఫలమైన తిలక్ వర్మ మాత్రం నిలకడైన పాము చూపించాడు. ప్రతి మ్యాచ్ లో కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ ఏడాది అటు జట్టులో స్థానం సంపాదించుకున్న నేహాల్ వదెరా కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇద్దరు యంగ్ ప్లేయర్స్ పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల కురిపించాడు.
తిలక్ వర్మ, నేహాల్ వదేరాలు తక్కువ సమయంలోనే టీమ్ ఇండియా తరఫున స్టార్లుగా ఎదుగుతారు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. బుమ్రా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ కు ఆడేందుకు మా జట్టు సహాయ బృందం ఎంతో శ్రమించింది. తర్వాత వాళ్లు సూపర్ స్టార్ లుగా తయారయ్యారు. తిలక్ వర్మ, నేహాల్ వాదేరా కూడా అంతే వచ్చే రెండేళ్లలో తప్పకుండా అటు ముంబై ఇండియన్స్ కు మాత్రమే కాదు భారత భారత జట్టులో ఆడుతూ స్టార్లుగా మారుతారు అంటూ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. ఇకపోతే ముంబై ఇండియన్స్ తర్వాత మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్ కు ఓడితే ఇంటికి వెళుతుంది.