ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ (WTC) ఫైనల్ కోసం టీమిండియా సర్వత్రా సిద్ధంగా వుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఇంగ్లండ్ కు చేరిన ఇండియా జట్టు నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇక కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే ఎలాగన్నా ఈ కప్పుని గెలవాలని వ్యూహాలు రెడీ చేస్తున్నాడు. ఇక మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఇంగ్లండ్ చేరుకొని ఫైనల్ కోసం తెగ కసరత్తులు చేస్తుంది. రెండు జట్లు కూడా ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి ట్రోఫీ అందుకోవాలని చాలా తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనబడుతోంది.

ఇకపోతే క్రికెట్ లో గెలుపోటములు ఎంత సహజమో.. డ్రాలు కూడా అంతే సహజం. పరిమిత ఓవర్ల క్రికెట్ లో మ్యాచ్ డ్రా అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంది. మ్యాచ్ టై అయినా సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేల్చేయడం జరుగుతుంది. అయితే ఇలా జరగడం చాలా అరుదుగా జరుగుతుంది. అయితే టెస్టు ఫార్మాట్ లో 'డ్రా' అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఇప్పుడు మిక్కిలి చర్చనీయాంశం అవుతోంది. అవును, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో కూడా డ్రా అయ్యేందుకు ఆస్కారం ఉంది.

ఒకవేళ, ఈ మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీ ఎవరికి దక్కుతుంది? అనే అనుమానం ఇపుడు చాలామందిలో వుంది. ఒకవేళ, ఫైనల్ మ్యాచ్ డ్రా అయితే డబ్ల్యూటీసీ సైకిల్‌లో అత్యధిక పాయింట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను చాంపియన్ గా అనౌన్స్ చేసే అవకాశం లేదు. అలా డ్రా అయితే.. ఇక్కడ రెండు జట్లను జాయింట్ విన్నర్లుగా ప్రకటిస్తారు. ఇతర ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ కు లాగా ఈ ఫైనల్ కు కూడా రిజర్వ్ డేను కేటాయించారు. టెస్టు మ్యాచ్ లో రోజుకు 90 ఓవర్ల ఆట ఉంటుంది. వర్షం, వెలుతురు లేమి వంటి కారణాలతో తొలి ఐదు రోజుల ఆటలో 90 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లను కోల్పోయినట్లు అయితే అప్పుడు రిజర్వ్ డే రోజు కూడా ఆట జరుగుతుంది. రిజర్వ్ డే 12వ తేదీ ఉండనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Wtc