ఇక ఈ స్టార్ ప్లేయర్ పేరు చెబితే చాలు.. సాకర్ అభిమానులు ఆనందంలో మునిగిపోతారు. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే క్రీడాకారుల్లో రోనాల్డో ఒకరు. అతడికి వారానికి దాదాపు రూ. 3 కోట్లకు పైగా చెల్లిస్తారు. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించే ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో రికార్డుల్లోకెక్కాడు. తన జీవితంలో మిగిలిన కాలమంతా తాను ఆటను ఎంజాయ్ చేస్తూనే ఉంటానని.. మరో పదేళ్ల పాటు ఆడతానని రోనాల్డో చెప్పడం కొసమెరుపు. 'వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' టైటిల్‌ను రోనాల్డో త్రీ సార్లు గెలుచుకున్నాడు.
రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ నుంచి మాడ్రిడ్‌కు మారిన తర్వాత 8 సీజన్లలో 360 గేమ్స్ ఆడి 371 గోల్స్ సాధించాడు. ఈ క్లబ్‌లో ఇంతవరకు ఎవరూ చేయనన్ని గోల్స్ చేయడంతో 2009లోనే రికార్డు స్థాయి పారితోషికాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖులు మనోడిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ముందు ఎవరు ఏం చెప్పాలన్నా.. రొనాల్డో కంటే ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుందని మాడ్రిడ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ వ్యాఖ్యానించారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు కువైట్‌కు చెందిన బాదర్ అల్ ముతావా (196 మ్యాచ్ లు), మలేషియాకు చెందిన చిన్ అన్ (195), ఈజిప్ట్‌కు చెందిన అహ్మద్ హసన్ (184), భారత్‌కు చెందిన సునీల్ ఛెత్రీ (137 మ్యాచ్‌లు) ఆడారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి