గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాను మిడిల్ ఆర్డర్ సమస్య వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. నాలుగు, ఐదు స్థానాలలో ఎవరిని బ్యాటింగ్ కు దింపాలి అనే విషయంపై ఇక టీమ్ ఇండియా సెలెక్టర్లకు కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. అయితే కొన్ని మ్యాచ్లలో ఆడిన ఆటగాళ్లు ఇక ఆయా స్థానాలలో బాగా సెట్ అయ్యారు అనుకునే లోపే ఇక ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమవ్వడం జరుగుతూ వస్తుంది  అయితే ప్రస్తుతం గాయం కారణంగా పంత్, అయ్యర్ జట్టుకు దూరంగా ఉండటంతో మరోసారి నాలుగు, ఐదు స్థానాలలో ఎవరిని ఆడించాలని పెద్ద తలనొప్పిగా మారింది.


 అయితే ఈ ఏడాది ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ లాంటి కీలకమైన టోర్నీలు ఉన్నాయి. ఇక ఇలాంటి టోర్నీల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే చివరికి మూల్యం చెల్లించుకోక తప్పదు   దీంతో 4, 5 స్థానాలలో ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది అనే విషయంపై భారత క్రికెట్లో తీవ్రత చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తెలుగు తేజం తిలక్ వర్మ ఆసియా కప్ సహా వరల్డ్ కప్ లో ఎంపిక చేయాలని అతన్ని నాలుగవ స్థానంలో ఆడించాలని ఎంతోమంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ తెలుగు క్రికెటర్ కి రోజు రోజుకు అటు మద్దతు మరింత పెరిగిపోతోంది.



 వరల్డ్ కప్ తుది జట్టులో తిలక్ వర్మ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది అంటూ రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే అతను ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ కావడం పెద్ద సానుకూల అంశం అంటూ చెప్పుకొచ్చాడు. తిలక్ వర్మ తన బ్యాటింగ్ తో నన్నెంతో ఆకట్టుకున్నాడు. నేనైతే ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ను ఆడిస్తా. అందుకు తిలక్ వర్మ సరైనోడు అంటూ రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. ఒకవేళ నేనే సెలెక్టర్ గా ఉంటే మాత్రం ఇక తిలక్ కు కచ్చితంగా ఎంపిక చేస్తా. అతని బ్యాటింగ్ లయ, ఆలోచన విధానం, ఆత్మవిశ్వాసం, పరిస్థితులను అర్థం చేసుకునే తీరు ఎంతో గొప్పగా ఉన్నాయి అంటూ రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: