ప్రస్తుతం వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి. అయితే సాధారణంగా ఒక మ్యాచ్ జరుగుతున్న సమయంలో పటిష్టమైన జట్టు తప్పకుండా విజయం సాధిస్తుంది అనే ఒక అంచనా క్రికెట్ విశ్లేషకులకు ఉండడం సహజం. ఏదో అద్భుతం జరిగితే తప్ప చిన్న టీమ్స్ విజయం సాధించలేవు అని అందరు ఫిక్స్ అయిపోతూ ఉంటారు. కానీ ఇలాంటి అద్భుతాలు అటు వరల్డ్ కప్ లో మాత్రం తరచూ జరుగుతూనే ఉన్నాయి. చిన్న టీమ్స్ పటిష్టమైన జట్లను ఓడిస్తూ చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నాయి. అదే సమయంలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు వరుస ఓవటములతో సతమతమవుతూ సెమీస్ అవకాశాలను చేజార్చుకుంటున్నాయ్.


 వరల్డ్ కప్ ప్రారంభమైన తర్వాత తమ ప్రదర్శనతో అంచనాలు తారుమారు చేసిన జట్టు ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్ అని చెప్పాలి. ఇప్పుడు వరకు వరుస ఓవటములతో సతమతమవుతున్న పాకిస్తాన్ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. గెలుపు వరించింది అనుకున్నప్పటికీ చివరి వరకు పోరాడిన సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్ కు సెమీఫైనల్ అవకాశాలు దాదాపు మూసుకుపోయినట్లే అని చెప్పాలి. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ లో ఇలా ఉత్కంఠ భరితంగా సాగి ఒక్క వికెట్ తేడాతో టీమ్స్ విజయం సాధించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి.



 ఇక ఇటీవల పాకిస్తాన్ పై సౌత్ ఆఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. దీంతో ఇలా ఒక వికెట్ తేడాతో వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ గెలిచాయి అని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే ప్రపంచ కప్ చరిత్రలో ఏడుసార్లు మాత్రమే ఇలా ఒక వికెట్ తేడాతో వివిధ జట్లు గెలిచాయి. పాకిస్తాన్ పై వెస్టిండీస్ 1975లో, వెస్టిండీస్ పై పాకిస్తాన్ 1987లో, శ్రీలంక పై దక్షిణాఫ్రికా 2007లో, వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ 2007లో, స్కాట్లాండ్పై ఆఫ్ఘనిస్తాన్ 2015లో, ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ 2015 లో, పాకిస్తాన్ పై సౌతాఫ్రికా 2023లో ఇలా ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc