ఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్ని ఎంత ఉత్కంఠ భరితం గా సాగుతూ ఉందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా అందరి అంచనాలను తారుమారు చేసే ఎన్నో ప్రదర్శనలు ఈ వరల్డ్ కప్ లో క్రికెట్ ప్రేక్షకులు చూశారు. అంతేకాదు ఛాంపియన్ టీమ్స్ దారుణమైన  ప్రస్థానాన్ని  చూసి ఆశ్చర్యపోయారు. ఎలాంటి అంచనాలు లేని చిన్న టీమ్స్ చారిత్రాత్మక విజయాలు సాధించిన తీరును చూసి ఫిదా అయ్యారు. ఇలా ఈ వరల్డ్ కప్ ఎంతో మంది అంచనాలను తారుమారు చేసి సరికొత్త రీతిలో ఎంటర్టైన్మెంట్ను పంచింది అని చెప్పాలి.


 అలాంటి వరల్డ్ కప్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. రేపటి నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈసారి ఫైనల్ మ్యాచ్లో గెలిచి విశ్వ విజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై ఇప్పటినుంచే చర్చ మొదలైంది. అయితే ఇక ఇలా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయో అని అటు అభిమానులు అందరూ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇక ఈ విషయంలో అటు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పింది ఐసీసీ.


 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను ఇటీవల విడుదల చేస్తు నిర్ణయం తీసుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో నవంబర్ 19వ తేదీన ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే సెమీఫైనల్ మ్యాచ్ లకి సంబంధించిన టికెట్లు అమ్మకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా మొదటి సెమి ఫైనల్ మ్యాచ్లో ఇండియా, న్యూజిలాండ్ జట్లు రెండో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అజట్లు తలపడబోతున్నాయి. నవంబర్ 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc