ఇండియాలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఎంతో మంది కుర్రాళ్ళు క్రికెట్ వైపే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్ లో తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలి అనుకునే ఆ యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కొన్ని కొన్ని సార్లు తడబడుతూ ఉంటారు. ఎందుకంటే ఒత్తిడికీ లోనై ఇక సరైన ప్రదర్శన చేయలేకపోతు ఉంటారు. కానీ ఇప్పుడు కుర్రాళ్లలో మాత్రం అలాంటి ఒత్తిడి ఎక్కడ కనిపించడం లేదు.


 అంతర్జాతీయ క్రికెట్లో ఆడుతున్న మొదటి మ్యాచ్ లోనే అనుభవం గల ప్లేయర్ల లాగా తమ ప్రతిభతో సత్తా చాటుతూ ఉన్నారు. దీంతో సీనియర్ ప్లేయర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది. అయితే ఇప్పుడు యంగ్ టీమ్ ఇండియా జట్టు అటు సీనియర్ ఆస్ట్రేలియా టీం తో స్వదేశంలో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగియగా రెండింటిలో కూడా భారత జట్టు విజయం సాధించింది. అయితే యువ ఆటగాళ్లు బ్యాటింగ్లో విధ్వంసం సృష్టిస్తున్న తీరు అయితే అసమాన్యంగా ఉంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓపెనర్ యశస్వి జైస్వాల్ వీరబాదుడు అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.



 ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో 25 బంతుల్లోనే సిక్సర్లు పోర్లతో చెలరేగిపోయి 53 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే జైష్వాల్ పై అతనీ చిన్ననాటి కోచ్ జ్వాలాసింగ్ ప్రశంసలు కురిపించారు. వీరేంద్ర సెహ్వాగ్ అప్గ్రేడ్ వర్షన్ లాగా జైస్వాల్ కనిపిస్తున్నాడు అంటూ కొనియాడారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పట్లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్ని రకాల షాట్ లను ట్రై చేసేవాడు. ఇక ఇప్పుడు ఈ యంగ్ బ్యాట్స్మెన్ ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. మరో లెజెండ్ సౌరవ్ గంగూలీ స్కిల్స్ కూడా జైస్వాల్ సొంతం అంటూ అతను చిన్ననాటి కోచ్ ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: