బిసిసిఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో ఇక ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన టీం ఏది అంటే అందరూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు చెబుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ గెలిచి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఛాంపియన్ టీం గా కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ రెండు టీమ్స్ తో సమానంగానే అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ప్రతిసారి కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగడం ఇక కీలకమైన మ్యాచులలో చెత్త ప్రదర్శన చేసి ఓడిపోయి.. ఇంటి బాట పట్టడం చేస్తూ వస్తుంది ఆర్సిబి. దీంతో ఇక బెంగుళూరు జట్టు అభిమానులందరికీ కూడా ఐపీఎల్ టైటిల్ అనేది అందనీ ద్రాక్ష లాగే మారిపోయింది. అయితే ఆర్ సి బి లో  తోపు ప్లేయర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరు కోహ్లీ పేరు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆర్సిబి అంటే కోహ్లీ. కోహ్లీ అంటే ఆర్సిబి అన్నట్లుగా అతని ప్రస్థానం కొనసాగింది. బెంగళూరు జట్టులో ఎక్కువ ధర పలికిన ప్లేయర్ గాను కోహ్లీ రికార్డు సృష్టిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ధర విషయంలో ఏకంగా ఆర్సిబి లోకి కోహ్లీని మించిన ప్లేయర్ వచ్చేసాడు.



 ఇటీవల ముంబై ఇండియన్స్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో చేరిన కామరూన్ గ్రీన్ ఏకంగా విరాట్ కోహ్లీనీ శాలరీ విషయంలో దాటేశాడు. కోహ్లీకి ప్రస్తుతం ఫ్రాంచైజీ 17 కోట్లు ఇస్తూ ఉంది. అయితే కామరూన్ గ్రీన్ ను మాత్రం 17.5 కోట్లకు బెంగళూరు జట్టు దక్కించుకుంది. దీంతో ఆర్సిబి చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఈ ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. 2018 వేలంలో కోహ్లీని 17 కోట్లకు ఆర్సీబీ రిటైర్ చేసుకుంది. మరి ఇంతభారీ ధర పెట్టి కొన్న తర్వాత  అతనికి దక్కిన డబ్బులకు న్యాయం చేస్తాడో లేదో అనేది 2024 ఐపీఎల్ సీజన్లో తేలనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: