ఇటీవల కాలంలో సభ్య సమాజం ఎంత స్వార్థపూరితంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేను బాగుండాలి అనే స్వార్థం తప్ప పరాయి వ్యక్తులకు సహాయం చేద్దాం అనే జాలి దయ గుణం ఎవరిలో కనిపించడం లేదు అని చెప్పాలి. దీంతో ప్రతి విషయంలో కూడా స్వార్థపూరితంగానే ఆలోచిస్తున్నాడు మనిషి. పైకి మంచి వాళ్ళలా ముసుగు వేసుకుంటున్న లోలోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలతోనే బ్రతికేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.



 అయితే నేటి రోజుల్లో అటు మనుషుల్లో నిజాయితీ అనేది కూడా పూర్తిగా కనుమరుగైపోతుంది. కానీ ఇక్కడ నిజాయితీకి నిలువెత్తురూపంగా ఉన్న ఒక మనిషి మంచి పని చేయబోతే చివరికి విధి చిన్నచూపు చూసి ప్రాణాలు తీసేసింది  సాధారణంగా రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు దొరికితే చుట్టుపక్కల ఎవరూ లేరు అన్న విషయం చూసి లటుక్కున తీసుకొని చటుక్కున జేబులో పెట్టేసుకుంటారు నేటి రోజుల్లో జనాలు. అలాంటిది బంగారం దొరికితే ఈరోజు అదృష్ట లక్ష్మి ఎదురొచ్చింది అని ఇక జేబులో వేసుకొని వెళ్లిపోతారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అలా చేయలేదు. కారులో  బంగారం చైన్ దొరికితే నిజాయితీగా ఆలోచించి ఏకంగా చైన్ పిఎస్ లో అప్పగించేందుకు వెళ్లాడు. కానీ విధి అతన్ని చివరకు మృత్యు ఒడిలోకి చేర్చింది


 హైదరాబాద్ నగరంలోని  షాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బేగంబజార్ ప్రాంతానికి చెందిన గోవిందు రామ్ సోనీ అనే 70 ఏళ్ల వెండి వ్యాపారి శుక్రవారం కోటికి వెళ్లేందుకు కారు బుక్ చేసుకుని వెళ్తుండగా.. వెనకాల సీట్ లో బంగారం చైన్ కనిపించింది. దీంతో బంగారం చైన్ పోలీసులు అప్పగించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడ పోలీసులతో మాట్లాడుతుండగా.. అతనికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన గురించి తెలిసినవారు అయ్యో దేవుడా నేటి సభ్య సమాజంలో ఇలాంటి నిజాయితీపరులు లేనేలేరు.. ఇలాంటి మంచి వాడిని చంపేసావా అని అనుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: