ఈ విషయం అందరికీ తెలిసిందే. ఢిల్లీలో అసలు ఆటగాళ్లే కరువయ్యారని.. ఈసారి ఢిల్లీ జట్టు గ్రూప్ దశను దాటడం కూడా కష్టమని ఐపిఎల్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే రాహుల్, అక్షర్ పటేల్ మాత్రమే ఢిల్లీ జట్టుని కాపాడగలరని జోస్యం చెప్పారు. కానీ కట్ చేస్తే, సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఢిల్లీ జట్టు కేవలం ముంబై చేతిలో మాత్రమే ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్ లో కరుణ్ నాయర్ అవుట్ అవకుండా ఉండి ఉంటే మ్యాచ్ పరిస్థితి ఢిల్లీకి అనుకూలంగా ఉండేది. కానీ అలా జరగలేదు. ఆ ఓటమి తర్వాత ఢిల్లీ జట్టు బాగా పుంజుకుంది. ఈ క్రమంలో ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చివరి వరకు పోరాడి, చివరికి విజయం సాధించింది. ఉత్కంఠతలో కూడా సమర్థవంతంగా ఆడి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సొంత గడ్డపై 200 స్కోర్ చేయకపోయినప్పటికీ.. చేసిన 188 పరుగులను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంది. చివరి ఓవర్లో అయితే అద్భుతంగా బౌలింగ్ వేసి.. 11 పరుగులు మాత్రమే ఇచ్చి.. 2 వికెట్లు పడగొట్టి రాజస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. అయితే సూపర్ ఓవర్లో ఢిల్లీ జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి ఏమీ కాదు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు ఇప్పటివరకు 5 సార్లు సూపర్ ఓవర్లు ఆడిన సంగతి మీకు గుర్తుందా?

కాగా, అందులో 4 మ్యాచ్లో విజయం సాధించింది. అయితే, గతంలో ఈ రికార్డు 3 విజయాలతో పంజాబ్ జట్టు పేరు మీద ఉండేది. కానీ ప్రస్తుతం ఢిల్లీ పేరిట ఆ రికార్డ్స్ నమోదు కబడడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ 2019లో కోల్ కతా, 2020లో పంజాబ్, 2021 లో హైదరాబాదు, 2025లో రాజస్థాన్ రాయల్స్ పై విజయాలు సాధించింది. 2013లో మాత్రం బెంగళూరు జట్టుతో సూపర్ ఓవర్ ఆడినప్పటికీ.. ఓడిపోయింది. ఇక నిన్న జరిగిన సూపర్ ఓవర్లో ఢిల్లీ జట్టు చాలా పకడ్బందీ ప్రణాళిక రచించింది. ముఖ్యంగా ఢిల్లీ జట్టు ప్రధాన బౌలర్ స్టార్క్ కట్టుదిట్టమైన బంతులు వేసే క్రమంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ... యార్కర్లు వేశాడు. ఫలితంగా ఢిల్లీ జట్టు 11 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ జట్టు 4 బంతుల్లోనే పూర్తి చేసింది. మొత్తంగా ఓడిపోయే మ్యాచ్లో గెలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: