2025 ఐపీఎల్ ఫైనల్ విజేత ఎవరనే విషయం పై చాలా ఉత్కంఠగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. రాయల్ చాలెంజర్స్ తో పంజాబ్ కింగ్స్ టీమ్ ఢీ కొట్టబోతోంది. మంగళవారం ఫైనల్ గేమ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. నిన్నటి రోజున రాత్రి క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ని రాయల్ చాలెంజర్స్ తో ఢీ కొట్టబోతున్నారు.

ఐపీఎల్ లో ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని విరాట్ కోహ్లీ చాలా కుతూహాలంగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీకి బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.. కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్ పైన సుమోటో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. సిగరెట్స్ అండ్ అతర్ టొబాకో ప్రొడక్ట్ యాక్టు కింద విరాట్ కోహ్లీ మీద కేసు నమోదు చేసినట్లు సమాచారం. సెక్షన్ 4, 21 కింద పోలీసులు కోహ్లీ మీద కేసు నమోదు చేశారు. ఐపీఎల్ ఫైనల్ జరుగుతున్న వేళ విరాట్ కోహ్లీకి ఇలాంటి షాక్ తగలడంతో అభిమానులు కొంతమేరకు నిరాశతో ఉన్నారు.

ముఖ్యంగా ఈ రెస్టారెంట్ పరిధిలో ప్రత్యేకంగా స్మోకింగ్ జోనర్ని సైతం ఏర్పాటు చేయకపోవడంతో సుమోటో కేసు కింద విరాట్ కోహ్లీ పేరు నమోదయిందట. అలాగే బెంగళూరులో ఉండే బృహత్ రెస్టారెంట్ కి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్లో ఈ నోటీసులు జారీ అయినప్పటికీ అగ్నిమాపక విభాగం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రావడం వల్ల బయటపడ్డారు.. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా హుక్క బార్ల పైన నిషేధాన్ని సైతం  విధించడంతోపాటుగా పొగాకు ఉత్పత్తులను సైతం చేయడం చట్టరీత్యా నేరం. అలాగే అందరి వయసు 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: