
రాజేష్ పీటర్ – ఢిల్లీకి గర్వకారణమైన క్రికెటర్ :
1981-82లో కర్ణాటకతో జరిగిన రంజీ ఫైనల్‌లో 67 పరుగులతో ఢిల్లీకి విజయాన్ని అందించిన ఫాస్ట్ బౌలర్ రాజేష్ పీటర్, 1996లో తన ఫ్లాట్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆత్మహత్య నోట్ లేకపోవడం, స్థితిగతులపై స్పష్టత లేకపోవడం మరణంపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.
రాజశ్రీ స్వైన్ – ప్రతిభ, నిరాశ మధ్య మరణించిన యువ క్రికెటర్ :
ఒడిశా ప్లేయర్ రాజశ్రీ స్వైన్ 2022లో చెట్టుకు వేలాడిన స్థితిలో కనిపించగా, ఆమెను రాష్ట్ర జట్టు నుంచి తొలగించారని నివేదికలు తెలిపాయి. అది ఆమె మానసిక స్థితిపై ప్రభావం చూపిందా? ఆమె కుటుంబం మరణం వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయం కోరుతోంది.
వీబీ చంద్రశేఖర్ – ఆర్థిక ఒత్తిడిలో కోలుకోలేకపోయిన మాజీ ఓపెనర్ :
ఇండియా తరఫున వన్డేలు ఆడిన చంద్రశేఖర్, రిటైర్మెంట్ తర్వాత కోచ్‌గా రాణించారు. అయితే, ఆర్థిక ఒత్తిడులు, క్రికెట్ అకాడమీ అప్పుల వత్తిడి మధ్య 2019లో ఆత్మహత్య చేసుకున్నారు.
అంకిత్ కేశ్రీ – మైదానంలోనే జరిగిన విషాదం :
వయసు తక్కువే అయినా ఆశలు పెద్దవిగా ఉన్న బెంగాల్ క్రికెటర్ అంకిత్ కేశ్రీ 2015లో ఫీల్డ్‌లో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో కన్నుమూశాడు. వైద్య పరంగా సహాయంలేమి? అనే డౌట్లు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
వసీం రాజా – ఆట మధ్యలో గుండెపోటుతో మృతిచెందిన పాకిస్తాన్ క్రికెటర్ :
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ వసీం రాజా, 2006లో ఇంగ్లండ్‌లో జరిగిన వెటరన్స్ మ్యాచ్‌లో ఆడుతున్నపుడు గుండెపోటుతో మరణించాడు. 54 ఏళ్ల వయసులో ఇలా జరిగిందన్న వార్త అంతర్జాతీయ క్రికెట్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది.