హైపర్ ఆది బుల్లితెరపై వేసే కౌంటర్లకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఆయన కౌంటర్లు ఒక్కొక్కసారి హద్దులు మీరూ తూ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు ఇతర ఆర్టిస్టులను సైతం చాలా ఇబ్బందులను కూడా చేస్తూ ఉంటాయి. మరి కొందరు మాత్రం హైపర్ ఆది పంచుల వల్లే తమకు గుర్తింపు వచ్చిందని అంటూ ఉంటారు. అయితే చిన్న ఆర్టిస్టుల వరకు ఇది ఓకే కానీ పెద్ద ఆర్టిస్టులను అయితే ఆది తన నోటి నుంచి ఎంతోస్తే అంత అనేస్తూ ఉంటారు. అలా బుల్లితెరపై ఎంతోమందికి సెటైర్లు వేయడం జరిగింది హైపర్ ఆది.


ఇక ఇప్పుడు ఇంద్రజ, కృష్ణ భగవాన్ తదితర వంటి వారి పైన కూడా కౌంటర్లు వేస్తూ ఉండడం జరుగుతూ ఉంటోంది. బుల్లితెర సెలబ్రిటీలు అయితే మరీ దారుణంగా ఉపయోగించుకుంటూ ఉంటారు హైపర్ ఆది. అయితే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కి హేమ రావడం జరిగింది ఇక హేమా ఏజ్ మీద పలు కౌంటర్లు వేశారు హైపర్ ఆది. మంగమ్మగారి కొడుకు అనే కాన్సెప్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక ఎపిసోడ్ను చేయడం జరిగింది ఇందులో హేమా కొడుకుగా నరేష్ కనిపించారు. అలా వీరిద్దరి మధ్య కొన్ని వింత గెటప్పులతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది.ఇక తరువాతే హైపర్ ఆది ఏంట్రా మీ అమ్మ 70 ఏళ్ళు వచ్చిన ఇంకా గౌన్లు వేయడం మానుకోవడం లేదా అంటూ హైపర్ ఆది కౌంటర్లు వేస్తారు. దీంతో నరేష్ తలకిందుకి దించుకున్నారు అయితే హేమ ఒకసారిగా షాక్ అయింది కానీ హేమాకు ఏం చెప్పాలో తెలియక సతమతమయ్యేలా ఈ వీడియోలో చూపించడం జరిగింది. అయితే రాకరాక షోలకు వస్తూ ఉంటే వచ్చినప్పుడల్లా ఇలా కౌంటర్ అన్ని రాసి హైపర్ ఆది ఇస్తుంటే హేమ కౌంటర్ ఎలా ఇవ్వగలదు అంటూ పలువురు నెటిజెన్లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: