
ఇక ప్రోమో విషయానికి వస్తే ఈ ప్రోమోలో రోజా, మంచు లక్ష్మి కూడా ఇద్దరూ గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చినట్టు కనిపిస్తోంది. స్టేజి పైకి వచ్చిన రోజా మాట్లాడుతూ ఎండాకాలంలో ఏదైనా మంచి ప్రదేశానికి వెళ్దాం అనుకుంటుంటే మంచు లక్ష్మి ని వచ్చింది అంటూ కౌంటర్ వేశారు. ఇక తర్వాత మంచు లక్ష్మి పోటీలో ఎవరైనా సరే కంచుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను..మీరు కలిశారంటూ రిప్లై ఇచ్చినట్టు కనిపిస్తోంది.. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలసి వాటర్ బోరింగ్ కొట్టే గేమ్ ని చాలా ఫన్నీగా ఆడారు.
ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా సందడి సందడిగానే కనిపిస్తున్నది. ఇక రోజా నాకు మంచు లక్ష్మి కి పోటీ అని చెప్పి రవి వెళ్లి బోరింగ్ కొడితే ఎలా అంటే రోజా చెప్పడం జరిగింది. దీంతో మంచు లక్ష్మి వెనక్కి వెళ్లి చూడండి నా బిందెలోన నీళ్ళు ఎక్కువ ఉన్నాయని డైలాగులు చెబుతుంది. మొత్తానికి బుల్లితెరపై రోజా, వర్సెస్ మంచు లక్ష్మి అన్నట్టుగా కొనసాగుతోంది. గతంలో బుల్లితెరపై హోస్టుగా ఉన్న మంచు లక్ష్మి ఈ మధ్యకాలంలో పెద్దగా ఎక్కడ కనిపించడం లేదు. ఎక్కువగా బాలీవుడ్ వైపుగానే ఫోకస్ చేసిందనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మళ్లీ చాలా ఏళ్ల తర్వాత బుల్లితెర పైన కనిపించబోతోంది.