
తాజాగా యాంకర్ రవి, శ్రీముఖి టీవీ షోకి హోస్టుగా చేస్తున్న కార్యక్రమానికి అనసూయ అతిథిగా రావడం జరిగింది. ఇందులో భాగంగా అనసూయకు ఒక టాస్క్ ప్రకారం అడిగిన ప్రశ్నలకు నిజాయితీగానే సమాధానాన్ని తెలియజేయవలసి ఉంటుంది.. లేకపోతే ఒక పచ్చిమిరపకాయను తినాలి.. దీంతో అనసూయ ఆ చాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాంకర్ రవి ఇలా ప్రశ్నిస్తూ .. మీకు వివాహం కాకపోతే టాలీవుడ్ లో ఏ హీరోతో డేటింగ్ చేసేవారు అని ప్రశ్నించగా.. అందుకు అనసూయ ఏ మాత్రం ఆలోచించకుండా మెగా హీరో రామ్ చరణ్ అని సమాధానాన్ని తెలిపింది.
రామ్ చరణ్ తో అనసూయ రంగస్థలం సినిమాలో నటించడంతో ఈమెకు మంచి ప్రశంసలు కూడా అందుకుంది. అలాగే హీరో అడవి శేషు గురించి కూడా పలు విషయాలను తెలియజేస్తూ అడవి శేషు ఎప్పుడూ కూడా మిలిటరీ ఆఫీసర్ లాగా చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని.. అందువల్లే ఆయన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి అంటూ ప్రశంసించింది అనసూయ. ఇక తన భర్త శశాంక్ పైన మాట్లాడుతూ తన భర్తలో ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఏమిటంటే షార్ట్ టెంపర్ అని తెలిపింది.. అన్నిటిలో అయితే మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ ప్రశంసలు కురిపించింది అనసూయ. అలాగే మొదట తన పేరుని పవిత్రగా పెట్టాలనుకున్నారని.. ఎందుకో అనసూయ అనే పేరు పెట్టారని అయినప్పటికీ కూడా తనకి తన తల్లి పిలిచిన పవిత్ర అనే పేరు ఇష్టమని తెలిపింది .