
అనసూయ ఇండస్ట్రీలోకి రాకముందే న్యూస్ రీడర్గా కూడా పనిచేసింది. 2013లో ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరించడంతో అనసూయ రేంజ్ మారిపోయింది. అనసూయ కిరాక్ బాయ్స్ ఖిలాడి సీజన్ 2 కి జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నది. అప్పుడప్పుడు ఈ షోలో కూడా అదిరిపోయేలా కనిపిస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా అనసూయ ప్రదీప్ టాక్ షో కి హాజరైనట్లుగా తెలుస్తోంది. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడినట్లు సమాచారం.
అనసూయ గురించి గూగుల్ లో చాలామంది తెగ వెతికేస్తున్న సంగతి బయటపెట్టారు..అనసూయ రేంజ్ పెరగడంతో ఆమె గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో ఎక్కువగా శోధిస్తున్నారట.. ముఖ్యంగా అనసూయ వయసు గురించి ఎంత ఉందనే విషయంపై సోదిస్తున్నట్లు యాంకర్ ప్రదీప్ అనసూయ కి చెప్పడంతో ఆశ్చర్యపోయింది.. ఈ విషయంపై అనసూయ 50 ఏళ్లు వచ్చిన కూడా అనసూయ ఇలాగే ఉంటుందనుకోండి అంటూ.. వయసుతో సంబంధం లేదంటూ వెల్లడించింది.
అనసూయ పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా అలరించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రంలో నటించింది.అలాగే తమిళంలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ ఉన్న అనసూయ నిరంతరం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటూ భారీగానే సంపాదిస్తోంది.