
అయితే తాజాగా ఇప్పుడు ఒక బుల్లితెర నటి హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు బ్రహ్మముడి సీరియల్ ద్వార మంచి పాపులారిటీ సంపాదించుకున్న దీపిక రంగరాజు. తెలుగు బుల్లితెరపై వంటలక్క తర్వాత మళ్లీ అంతటిస్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది దీపిక రంగరాజు. వాస్తవానికి తమిళ నటి అయినప్పటికీ కూడా తెలుగు ఆడియస్ ను బాగ ఆకట్టుకుంది. పలు రకాల టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ఈమధ్య కాలంలో ఎక్కువగా ఈవెంట్స్ లలో కనిపిస్తూ ఉంది.
తాజాగా తనకు బిగ్ బాస్ హౌస్ లో అవకాశం ఇవ్వాలంటూ కోరుకుంటోంది. ప్రస్తుతం తాను చేస్తున్న సీరియల్ బ్రహ్మముడి ఈ సీరియల్ చేస్తున్న కాబట్టి వెళ్లలేనేమో.. ఒకవేళ సీరియల్ షూటింగ్ పూర్తి అయితే వెళ్తాను అయితే తనకు ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ రాలేదు..కానీ ఒకవేళ వస్తే ఖచ్చితంగా వెళ్తానని బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనడం తనకు చాలా ఇష్టమని వెల్లడించింది.. వెళ్లాను అంటే కచ్చితంగా టైటిల్ గెలిచే వస్తాను.. నాగార్జున గారు నా చెయ్యి పైకెత్తి విన్నర్ అని చెప్పాలని తెలియజేసింది దీపిక రంగరాజు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి అనుకున్నట్టుగానే ఈమెకు అవకాశం వస్తుందో రాదో చూడాలి.