ఇస్రో కార్టోశాట్ ప్రయోగం సక్సస్ అయ్యింది. ఇక పాకిస్తాన్ గుండెల్లో గుబులు ఖాయం.. అదేంటి.. ఇస్రో ప్రయోగానికి పాకిస్తాన్ కు లింకేంటి అనుకుంటున్నారు. ఇస్రో తాజా ప్రయోగంతో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సీ 47ను అంతరిక్షంలోకి విజయవతంగా ప్రయోగించారు.

 

ఈ ప్రయోగంతో పీఎస్‌ఎల్‌వీ సీ-47 ద్వారా కార్టోశాట్ 3తో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. హై రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న ఉపగ్రహంగా కార్టోశాట్ 3ని రూపొందించారు. ఈ ఉపగ్రహం ద్వారా అద్భుతాలు చేయొచ్చు.

 

ఈ ఉపగ్రహం నుంచి భూమి మీద ఉన్న ఉగ్రవాద శిబిరాలు, దాక్కున్న శత్రువులకు సంబంధించిన ఫొటోలను స్పష్టంగా తీయొచ్చు. ఇక పీఓకేలో దాక్కున్న ఉగ్రవాద ముఠాలను ఈ ఉపగ్రహ సాయంతో సులభంగా అంచనా వేయొచ్చు. వారి కదలికలను పసిగట్టవచ్చు.. గుట్టుగా మట్టుబెట్టేయవచ్చు.

 

అందుకే కార్టోశాట్ ప్రయోగం సక్సస్ పాక్ గుండెల్లో దడ పుట్టిస్తోంది. అక్కడి ఉగ్రవాదులకు ఇక ఇండియా చేతిలో మూడినట్టే. వాస్తవానికి ఈ కార్టోశాట్ ఉపగ్రహ ప్రయోగం ఈ నెల 25వ తేదీనే చేపట్టాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. బుధవారం ఉదయం విజయవంతంగా పూర్తి చేశారు. శభాష్ ఇస్రో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: