ఒకవైపు కరోనా... మరోవైపు 5g ప్రస్తుతం చైనాలో పరిస్థితి. ప్రపంచం మొత్తానికి కరోనా వైరస్ ని అంటించి ఆయా దేశాలు ఇబ్బంది పడుతుంటే చైనా మాత్రం టెక్నాలజీలో మాత్రం దూసుకెళుతోంది. ఇక అసలు విషయానికి వస్తే... చైనాలో 5g సేవలు మొదలయ్యాయి. అయితే అంత కాదులేండి కేవలం ఎవరెస్ట్ శిఖరం ప్రాంతంలో మాత్రమే.

 


చైనా దేశం వైపు నుంచి ఎవరైతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఈ సందర్భంగా చైనా దేశపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన " చైనా మొబైల్ " కంపెనీ నిర్మించిన బేస్ స్టేషన్ తన కార్యకలాపాలను మొదలు పెట్టిందని ఆ దేశ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఈ బేస్ స్టేషన్ ని సముద్ర తీరానికి ఏకంగా 6500 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఈ సేవలు గురువారం నుంచి మొదలు కావడం జరిగింది. ఎవరెస్ట్ పర్వతం శిఖరంపై పూర్తి స్థాయిలో ఐదు సేవలను అందించుటకు 5,300 మీటర్లు, 5800 మీటర్ల ఎత్తున బేస్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారని చైనా అధికార వార్తాపత్రిక ‘జిన్హువా’ ఈ విషయాన్ని తెలిపింది.

 

 

ఇక ఇంత ఎత్తైన ప్రదేశంలో ఐదు 5g స్టేషన్లను నిర్మించడానికి ఏకంగా 14.2 లక్షల డాలర్లు ఖర్చు అయ్యిందని అధికార వర్గాలు తెలిపాయి. ఎవరైతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహణకు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సంబంధాలను మెరుగు పరిచేందుకు ఈ బేస్ స్టేషన్ లు ఎంత గానో సహాయపడతాయి.దీనితో పరిశోధకులకు, సహాయ సిబ్బందికి చాలా సులువుగా కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇందులో 5300 మీటర్ల వద్ద ఏర్పాటు చేసిన 5g స్టేషన్ ను బెస్ట్ స్టేషన్ గా ఉపయోగించబోతున్నారు. ఈ సేవలను కేవలం పర్వతారోహకులు, అక్కడికి వచ్చే పర్యాటకులు, దగ్గరలోని స్థానికులు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాన్ని పక్కన పెడితే కరోనా వైరస్ నుంచి చైనా ఎలా బయటపడిందో ఇప్పటివరకు ఏ దేశానికి అర్థం అవ్వట్లేదు. ఆ దేశం నుంచి వచ్చిన వైరస్ తో ప్రపంచమంతా విలవిలలాడుతుంటే చైనా మాత్రం పురోగతి వైపు పరుగులు పెడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: