పండగ సీజన్ల లో ఎలెక్ట్రానిక్ కంపెనీలు కొత్త కొత్త వస్తువులను అందుబాటులోకి తీసుకొస్తారు.. ఇంకా చెప్పాలంటే మొబైల్ కంపెనీ వాళ్ళు అయితే మరీనూ.. అదిరిపోయే ఫీచర్లతో పాటుగా, నాణ్యమైన ధరలు అందిస్తున్నాం అంటూ కొనుగోలు దారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. ఇకపోతే ఈ దసరా దీపావళికి మాత్రం ఓ రేంజులో కొత్త ఫోన్లు మార్కెట్ లో సందడి చేశాయి. కస్టమర్లు కూడా పండగను కొత్త వస్తువులతో సంబరాలు జరుపుకున్నారు. ఈ పండగ సీజన్ లో భారీగా అమ్ముడు పోయిన ఫోన్ అంటే  షియోమీ అధికారికంగా ప్రకటించింది. గత నెలలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ను, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో ఈ ఫోన్ ను ఎక్కువగా అమ్ముడు పోయిందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేశారు..



ఈ సేల్‌లో తన స్మార్ట్ ఫోన్లపై షియోమీ భారీ డిస్కౌంట్లను అందించింది.ఎంఐ 10టీ ప్రో, రెడ్ మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్ మీ నోట్ 9 ప్రో, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్ మీ 9, రెడ్ మీ 9ఏ వంటి స్మార్ట్ ఫోన్లే 90 లక్షల వరకు విక్రయించబడినట్లు షియోమీ తెలిపింది. టీవీలు, స్ట్రీమింగ్ డివైస్‌లు, ట్రిమ్మర్లు, స్మార్ట్ బ్యాండ్లు, ఆడియో ఉత్పత్తులు, పవర్ బ్యాంకుల వంటి ఉత్పత్తులు 40 లక్షల వరకు కంపెనీ సెల్ చేసిందని కంపెనీ సేల్స్ మేనేజర్ తాజాగా వెల్లడించారు.



ఎంఐ వాచ్ రివాల్వ్, ఎంఐ స్మార్ట్ స్పీకర్, ఎంఐ బాక్స్ 4కే, ఎంఐ టీవీ స్టిక్ వంటి ఉత్పత్తులను కూడా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసినట్లు షియోమీ తెలిపింది.ఇవే కాదు పవర్ బ్యాంకులను కూడా కోటికి పైగా అమ్మినట్లు పేర్కొన్నారు. కూలర్ ,ఎయిర్ ఫ్యురిపైయర్లు కూడా భారీ స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.ఈ సంవత్సరం మొత్తానికి ఇప్పుడు అమ్మకాలు ఎక్కువగా జరిగినట్లు తెలిసింది. ఇకమీదట కూడా కొత్త కొత్త వస్తువులను అతి తక్కువ ధరలకే అందిస్తున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించారు..మొత్తానికి ఈ పండుగ సీజన్లలో ఈ రెడ్ మీ కంపెనీకి సంబంధించిన వస్తువులు భారీగా అమ్ముడు పోయాయని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: