ఈ రోజుల్లో దాదాపు అందరి మొబైల్స్ లో వాట్సాప్ యాప్ తప్పక ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఈ యాప్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇంటిలో ఉండే అమ్మ నుండి పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓ లుగా ఉన్న వారి వరకు అందరూ ఈ వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం వాట్సాప్ యాజమాన్యం కొన్ని నిబంధనలను తీసుకువచ్చి వినియోగదారుల్లో కొంతమేరకు గందరగోళాన్ని సృష్టించి, వారి అసహనానికి కారణం అయింది. అయితే దాని తర్వాత ఇప్పుడు మరి కొన్ని ప్రత్యేక ఫీచర్స్ వాట్సాప్ లో జోడించి వినియోగదారులు సంతోషంగా తమ సేవలను ఉపయోగించుకుందుకు వెసులుబాటు కల్పించింది. అయితే కొత్తగా ఏ ఫీచర్స్ వాట్సాప్ లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
* 2018 వ సంవత్సరంలో పేస్ బుక్ యాజమాన్యం వాట్సాప్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి పేస్ బుక్ యాజమాన్యం వివిధ రకాల ఫీచర్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేసింది.
* ఒకేసారి వాట్సాప్ యాప్ ను మీరు ఎన్ని మొబైల్స్ లో అయినా ఇంస్టాల్ చేసుకుని ఉపయోగించవచ్చు. అంతే కాకుండా ఎటువంటి పరిమితులు లేకుండా ఫోటోలు మరియు వీడియోలను పంపడానికి అనుమతులను ఇవ్వడం జరిగింది. మీ వాట్సాప్ లో ఉన్న వీడియోలు గడువు ముగిసి పోకుండా ఉండడానికి సపోర్ట్ చేసే ఫీచర్ ను తీసుకొచ్చారు.

* ఇవే కాకుండా, వాట్సాప్ వీడియో మరియు ఆడియో కాల్ ను ఎటువంటి అంతరాయం లేకుండా ఉపయోగించడానికి ప్రత్యేకంగా UI ఫీచర్ ను యాడ్ చేశారు. ఈ ఫీచర్ వలన మీరు ఏమైనా గ్రూప్ వీడియో మరియు ఆడియో కాల్స్ ను మిస్ అయి ఉంటే వాటిని తిరిగి పొందడానికి వీలుగా ఉంటుంది.

* ఇంతకు ముందు వరకు ఇది కేవలం పరిమిత వాట్సాప్ యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క వాట్సాప్ యూజర్ కు అందుబాటులోకి వచ్చింది.

* రెండు రోజుల క్రితం ఒక బ్లాగ్ లో వాట్సాప్ ఈ విధంగా పోస్ట్ చేసింది. ఇక నుండి ఒకవేళ వాట్సాప్ గ్రూప్ కాల్స్ స్టార్ట్ అయినా ఉన్నా కూడా, మీరు జాయిన్ అవడానికి వీలుగా ఉంటుంది.  మీకు ఎవరైనా గ్రూప్ కాల్ చేసినప్పుడు, మీరు బిజీగా ఉండి ఫోన్ రిసీవ్ చేయకున్నా, ఆ గ్రూప్ కాల్ లో మీరు చేరడానికి కాల్ ట్యాబ్ కి వెళ్లి అక్కడ జాయిన్ ఆప్షన్ ను సెలెక్ట్ చేయండి.

* అది మీరు మళ్ళీ ఆ గ్రూప్ కాల్ కు యాడ్ అవడానికి సహకరిస్తుంది. ఇదే విధంగా గూగుల్ కాల్స్ మరియు జూమ్ వీడియో కాల్స్ లోనూ పొందవచ్చు. ఈ ఫీచర్ లో ఇంతకుముందు మీకు కాల్ ను ఎండ్ చేయాలంటే రెడ్ టచ్ ఆప్షన్ ఉండేది. కానీ ఇక్కడ మీకు ఇగ్నోర్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. మరియు రిసీవ్ చేయడానికి గ్రీన్ ఆప్షన్ కు బదులుగా  జాయిన్ అనే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. త్వరలోనే మరింత గొప్పగా ఫీచర్ లను అందుబాటులోకి తెస్తారని తెలుస్తోంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: