
1. ఆల్టర్ నేటివ్ గా తక్కువగా ఫోన్లు మాట్లాడటం అలవాటు చేసుకోండి, వాటికి బదులుగా వాట్సాప్ లోనో లేదా హెడ్ ఫోన్స్ వంటి వాటి ద్వారా ఫోన్ మాట్లాడటం ద్వారా కొంత వరకు రేడియేషన్ ప్రభావం నుండి తప్పించుకోవచ్చు.
2. స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు డార్క్ మోడ్ లో పెట్టుకోవడం కూడా ఒక మంచి అలవాటే.
3. రాత్రి సమయం పడుకునే ముందు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పడుకోండి. చాలా మంది ఫోన్లను అలారం లా వాడుతూ పక్కనే పెట్టుకుని నిద్రపోతున్నారు. దీని వలన మనపై ఈజీగా రేడియేషన్ ప్రభావం పడుతుంది.
4. ఫోన్ సిగ్నల్ 24 గంటలు ఫోన్ వాడకండి. వీలయినంత వరకు ఫోన్ ను దూరంగా ఉంచడం చూసుకోండి. ఖాళీగా ఉంటే చాలా మంది పక్కనే పెట్టుకుని పాటలు వినడం వంటివి చేస్తుంటారు. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు ఫోన్ ని దూరంగా ఉంచడం చూసుకోండి.