వాట్సప్ యూజర్లు రోజురోజుకీ వినియోగం పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగా సరికొత్త ఫీచర్స్ తో తమ యూజర్స్ ని ఆకట్టుకునే పనిలో పడింది వాట్సాప్ సంస్థ. ఇప్పటివరకు ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అందుబాటులో ఉండేటువంటి ఒక ఫీచర్ ను వాట్సాప్ లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి వీటి వల్ల ఉపయోగం ఏంటనే విషయాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.. అసలు విషయంలోకి వెళ్తే యూజర్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నటువంటి వీడియో కాల్స్ స్క్రీన్ షేర్ ఫిచర్ ను సైతం వాట్సాప్ ఇటీవలే తీసుకువచ్చింది.


యువత ఇలాంటి ఫీచర్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు.. లేకపోతే కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి గ్రూప్ కాలింగ్ వంటి వాటిలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఫీచర్ సహాయంతో ఎవరితోనైనా మనం వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో మన స్మార్ట్ మొబైల్ యొక్క స్క్రీన్ అవతలి వ్యక్తికి మనం షేర్ చేసుకోవచ్చు. ఈ ఫిచర్ ని ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా ఒక సెట్టింగ్ ని ఆన్ చేయవలసి ఉంటుంది..


వాట్సప్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్ డ్రాప్ లోకి వెళ్లి అందులో ఉన్న ట్యూబ్ పైన ప్రెస్ చేయాలి.. అప్పుడు కెమెరా స్విచ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.. దీనిపైన క్లిక్ చేసిన తర్వాతనే స్క్రీన్ షేర్ బటన్ సింబల్ కనిపిస్తుంది.. వెంటనే మీ మొబైల్ లో స్క్రీన్ షేర్ ఆప్షన్ ని స్టార్ట్ నౌ పైన క్లిక్ చేస్తే స్క్రీన్ షేర్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది.. గూగుల్ మీట్ ,జూమ్ కాల్స్ వంటి వాటి నుంచి ఎదురయ్యే సమస్యలకు విసిగిపోయిన వారు వాట్సాప్ లో ఈ కొత్త ఫీచర్ ని ఉపయోగించుకొని గ్రూప్ కాల్స్ లేదా పర్సనల్ కాల్స్ వంటివి చేసుకోవచ్చు. ఈ ఫీచర్ తో మొబైల్ లోని డేటాను సైతం షేర్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: