రిలయన్స్ మొబైల్స్ నెట్వర్క్ వచ్చినప్పటి నుంచి చౌక ధరకే మనకి డేటా ప్లాన్స్, మొబైల్స్ , టాక్ టైమ్ అన్నీ కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో 5జి నెట్వర్క్ నడుస్తూ ఉండడంతో 5జి స్మార్ట్ మొబైల్స్ ను జియో సంస్థ విడుదల చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.. రిలయన్స్ జియో 5జి విస్తరణలో చాలా దూకుడుగా ముందుకు వెళుతోంది 5g టెక్నాలజీని అందుబాటులో తీసుకురావడానికి కంపెనీ కూడా దాదాపుగా అన్ని పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.. అయితే 5జి నెట్వర్క్ కి మారాలని చూస్తున్న 2జీ వినియోగదారులు ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ఉన్నారట.


ఇక్కడే క్వాల్కమ్ జియో తో కలిసి పని చేయాలని ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. యూఎస్ ఆధారితంగా మనదేశంలో ఎంట్రీ లెవెల్ ఫై 5g స్మార్ట్ మొబైల్ ని లాంచ్ చేసే విధంగా ఒక చిప్స్ సెటును పరిచయం చేయబోతున్నారు.. మనీ కంట్రోల్ నివేదికంగా క్వాల్కమ్ ఎంట్రీ లెవెల్ 5జి స్మార్ట్ మొబైల్ ను తీసుకురావడానికి జియో తో భాగమైంది.. దీని ధర..$99 (ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 8,000) పైగా ఉంటుందని తెలుస్తోంది.. చౌక ధరకే 5g హ్యాండ్ సెట్ మొబైల్ ను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయబోతున్నారు.


కష్టమైజ్ ప్రాసెసర్ తో ఈ మొబైల్ పనిచేస్తుందని కొత్త చిప్సెట్ దేశంలో సరసమైన స్మార్ట్ మొబైల్స్ కోసం పూర్తి అనుభవాన్ని జియో సంస్థ అందిస్తుందట.4g,5g మార్పుల పైన చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టారని తెలియజేశారు. 2g వినియోగదారులు కూడా 5g వాడకాన్ని ఉపయోగించే విధంగా ఈ స్మార్ట్ మొబైల్ ని తయారు చేయబోతున్నారట. అయితే ధర విషయంలో ఇంత తక్కువ ధరకే 5జి మొబైల్ ని తీసుకు రావడంలో ఖచ్చితంగా మార్కెట్లో సంచలన సృష్టిస్తుంది జియో మొబైల్..Qualcomm హ్యాండ్ సెట్ తో మార్కెట్లోకి రాబోతోంది.. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: