ప్రస్తుతం ఎండాకాలం రావడంతో ఈసారి ఎండలు కూడా విపరీతంగా మండిపోతున్నాయి.. ముఖ్యంగా చాలామంది ఇళ్లల్లో ఫ్యాన్ గాలి కింద ఉండడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో చాలామంది ఏసీ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు మాత్రం ఏసీకే డబ్బులు పెట్టలేక కూలర్లతోనే సరిదిద్దుకుంటారు.. అయితే కూలర్లు ఏసి ఇచ్చిన చల్లదనాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాయి. ఈ సమయంలోనే తాజాగా ఏసీ ని అతి తక్కువ ధరకే కొనుక్కునే విధంగా పలు రకాల కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి.


అలా పలు  రకాల ఈ కామర్స్ సంస్థలలో కూడా భారీ డిస్కౌంట్లను తీసుకువచ్చారు.. ఈ మధ్యకాలంలో పోర్టబుల్ ఏసీ క్రేస్ భారీగానే పెరుగుతుంది.. ఈ ఏసీ వినియోగం కూడా చాలా సింపుల్ గా ఉండడంతో ప్రతి ఒక్కరు వీటిని వినియోగించడానికి మక్కువ చెబుతున్నారు.. ఇది సాధారణంగా కూలర్ మాదిరిగానే ఒక చిన్న గది నుంచి మరొక గదికి కూడా వీటిని తీసుకొని వెళ్లవచ్చు. దీంతో ప్రస్తుతం పోర్టబుల్ ఎసి లకు మంచి డిమాండ్ పెరుగుతున్నది.


గది చిన్నగా ఉన్న వారికి వన్ టన్ ఏసీ బాగా సరిపోతుంది.. ఈ పోర్టబుల్ ఎసి ప్రారంభం ధర రూ.39,000 రూపాయల గా ఉన్నది..amazon లో దీనిపైన 12 శాతం డిస్కౌంట్తో రూ.34,490 రూపాయలకే లభిస్తుంది.. ఈ ఏసీ కొనుగోలు పైన పలు రకాల బ్యాంక్ ఆఫర్స్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నవి.. దీన్నిబట్టి మరింత ధర కూడా తగ్గవచ్చు.. ఈ ఏసి విషయానికి వస్తే పోర్టబుల్  ఏసీ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది.. దూరం నుంచి వాషింగ్ మిషన్ లా ఉన్నప్పటికీ ఏసి ఎయిర్ కూలర్ అనే రకాల మోడల్స్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి అతి తక్కువ విద్యుత్ బిల్లును కూడా అందిస్తాయి. వీటితో పాటు మధ్యతరగతి మినీ ఏసీలు కూడా ఉన్నాయి. ఇవి కూడా అత్యంత తక్కువ కరెంటుని వినియోగాన్ని అందిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: