పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం, కానీ కొంతమంది దొంగ వ్యక్తులు తమ అంద చందాలతో కొంతమందిని ఆకర్షించడం ద్వారా దాన్ని క్యాష్ చేసుకోని దోపిడీ చేస్తారు. ఇంకా వారి కుటుంబాలను మోసం చేసి ఆ తర్వాత డబ్బులు దోచుకొని పారిపోతారు.ఇక ఇలాంటి షాకింగ్ ఘటన పంజాబ్‌లోని పాటియాలలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక వధువు ఏకంగా 8 మంది వరులను వివాహం చేసుకుంది. భయపడాల్సిన విషయం ఏమిటంటే ఆమె ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆ తరువాత వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే వారం రోజుల క్రితం, పోలీసులు ఈ దొంగ వధువును అరెస్టు చేశారు. వధువు hiv పరీక్షను పోలీసులు చేసినప్పుడు, ఇక ఆమెకు పాజిటివ్‌గా తేలింది.ఇక సమాచారం ప్రకారం, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వధువు వివాహం అయిన తర్వాత దాదాపు ఒక వారం పాటు ప్రతి వరుడి వద్ద ఉండిపోయిందట. 

ఇక పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ ఎయిడ్స్ రోగి అని తేలిందని పోలీసు అధికారి తెలిపారు. ఆమె ఇప్పటివరకు వివాహం చేసుకున్న వ్యక్తులందరూ కూడా hiv పరీక్షలు చేయించుకుంటున్నారు.వధువు హర్యానాలోని కైతాల్ జిల్లా నివాసి. ఆమె నిజమైన వివాహం 2010 సంవత్సరంలో పాటియాలాలో జరిగింది మరియు ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం, ఆమె వివాహం పేరుతో ప్రజలను మోసం చేసే అక్రమ వ్యాపారాన్ని ప్రారంభించింది. పంజాబ్-హర్యానాలోని కొంత మంది అమాయకపు వ్యక్తులను ఆకర్షించి వారిని దోచుకుంది. ఇక దొంగ వధువు విలాసవంతమైన జీవితం గడపాలని కోరుకుంటున్నట్లు పాటియాలా ఎస్పీ సిటీ వరుణ్ శర్మ తెలిపారు. త్వరలో ధనవంతురాలవ్వాలని కోరుకుంటూ, ఆమె తన తల్లి మరియు మరికొంతమంది బంధువులతో కలిసి వివాహాల నెపంతో ప్రజలను మోసం చేయడం ప్రారంభించింది. పోలీసుల విచారణలో నిందితురాలు తన నేరాన్ని అంగీకరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: