ఇటీవల కాలంలో ఎంతో మంది యువత మాదక ద్రవ్యాలకు బానిస గా మారి పోతు చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యువత డ్రగ్స్ బారిన పడి ఎంత చెడిపోతున్నారో అన్న దానికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారి పోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ లో తెగ చక్కెర్లు కొడుతుంది అనే చెప్పాలి. ఇక్కడ ఓ యువతి మత్తులో నడి రోడ్డుపై ప్రవర్తించిన తీరుకు  ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అందరిలాగానే ఒక యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుంది. ఇలాంటి సమయంలో రోడ్డు మధ్యలో ఒక్కసారిగా ఆగి పోయింది. కాగా యువతీ కాస్త విచిత్రంగా ప్రవర్తించింది. కిందకి చూస్తూ ఏదో వెతకడం ప్రారంభించింది. ఇక ఆ తర్వాత మరికొంచెం ముందుకు వెళ్ళింది. ఆ యువతి తర్వాత చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించి అక్కడే నిలబడిపోయింది.  ఈ క్రమంలోనే కూర్చోలేక నిలబడలేక ఎంతో ఇబ్బంది పడింది అని చెప్పాలి. దీంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆమెను విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు.


 అక్కడ జరుగుతున్న విషయాన్ని యువతి ప్రవర్తనను సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియా పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. అమృత్ సర్ సిటీ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.   యువతి రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఆగి పోయింది. దిక్కులు చూస్తూ విచిత్రంగా ప్రవర్తించింది. ఇక కాసేపటి వరకు ఆ యువతి అక్కడే ఉండిపోయింది అనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారి పోవడంతో సదరు యువతి డ్రగ్స్ నిషాలో ఉందని ఎంతో మంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: