ఇక న్యూజిలాండ్‌తో జరగబోయే ప్రతిష్టాత్మక టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమిండియా బాగా గట్టిగానే కష్టపడుతుంది. సౌతాంప్టన్‌లోని ఏజీస్‌ బౌల్‌ మైదానంలో టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్‌ సెషన్‌లో చెమటోడ్చారు. విరాట్ కోహ్లీ, రహనే, రిషబ్ పంత్, రోహిత్ ఇలా ప్లేయర్స్ అందరూ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తూ రిథమ్ అందుకునే పనిలో ఉన్నారు. అయితే, టీమిండియా ప్రాక్టీస్ సెషన్ తర్వాత విన్ స్టన్ అనే కుక్కతో ఆడుకోవడం ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.ఇక రవి శాస్త్రి విన్‌స్టన్‌ అనే కుక్కకు టెన్నిస్‌ బాల్‌ను విసిరి క్యాచ్‌ అందుకోమన్నాడు.బాల్ ని అందుకున్న తర్వాత ఆ కుక్క మైదానంలో పరుగెత్తుతూ వచ్చి రవి శాస్త్రికి బంతిని అందించింది. ఆ కుక్కతో క్యాచ్‌లు పట్టిస్తున్న వీడియోను రవిశాస్త్రి ట్విటర్లో షేర్‌ చేశాడు. అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమిండియా వేగంగా సన్నద్ధం అవుతోంది. దొరికిన ఈ కొద్ది సమయాన్ని కూడా బాగా సద్వినియోగం చేసుకుంటోంది. ఇక సోమవారం వరకు కూడా ఇంట్రా స్వ్యాడ్ మ్యాచ్ ఆడిన టీమిండియా మంగళవారం నెట్స్‌లో శ్రమించింది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ బౌన్సర్లు, షార్ట్‌పిచ్‌ బంతులను ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాడు. ఇక వైస్ కెప్టెన్ అజింక్య రహానె, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ సైతం చెమటోడ్చారు. ఇక ఇంగ్లండ్‌లో బంతులు బాగా స్వింగవుతాయనే సంగతి తెలిసిందే. ఫాస్ట్ గా వచ్చే బంతులను డ్రైవ్‌ చేయాలని భావిస్తుంటారు. అందుకే ఆ క్రమంలోనే బాల్స్ బ్యాటు అంచులకు తగిలి స్లిప్‌లో లేదా వికెట్‌ కీపర్‌కు చిక్కుతుంటాయి. అందుకే అలాంటి బాల్స్ ను టీమిండియా ఆటగాళ్లు బాగా ప్రాక్టీస్ చేశారు.ఇక, ఇంట్రా స్వ్యాడ్ మ్యాచ్ లో మన కుర్రాళ్లు మాత్రం భలేగా అదరగొట్టారు. రిషబ్ పంత్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ తమ ఆటతో సత్తాచాటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: