
అందుకే ఈ రెండూ ఎప్పుడూ ఎదురు పడవు అని చెప్పాలి. ఒకవేళ కుక్క పిల్లి ఎప్పుడైనా ఎదురుపడితే ఇక ఏదో ఒకటి గాయపడటం లాంటివి మాత్రం జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మాత్రం కుక్క పిల్లి రెండూ కూడా పెంపుడు జంతువులు గా మారిపోయిన నేపథ్యంలో ఇక జాతి వైరాన్ని మరచి ఎంతో స్నేహ భావంతో మెలుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది అనే చెప్పాలి. కుక్క కిటికీ గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో పక్కనే ఉన్న స్నేహితుడు పిల్లి ఆ కుక్క కు సహాయం చేసింది.
వీడియో నెటిజన్లు అందర్నీ కూడా ఫిదా అయ్యేలా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ట్విట్టర్లో ఈ వీడియో తెగ చక్కెర్లు కొడుతుంది. అయితే ఒక వైపు ఉన్న కుక్క పిల్ల మరోవైపు ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది.. అయితే మధ్యలో గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుంటుంది కుక్క పిల్ల. వెంటనే అప్రమత్తమైన పిల్లి తన ఫ్రెండ్ ను గ్రిల్స్ మధ్యలో నుంచి తీసేందుకు సహాయం చేసింది. ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు ఫ్రెండ్ అంటే ఇలాగే ఉండాలి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.. కష్టం వచ్చినప్పుడు స్నేహితుడు ఎప్పుడు తోడుంటాడని ఈ వీడియో మరోసారి చెప్పకనే చెప్పింది అని అంటున్నారు నెటిజన్లు.